ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిల్‌ పీఠా

ABN, First Publish Date - 2021-11-06T18:23:09+05:30

అస్సామీ తీపి వంటకం ఓ వైపు మెత్తగా, మరోవైపు కరకరలాడుతూ తమాషాగా ఉంటుంది. శీతాకాలం తినవలసిన ఈ వంటకం ఎలా వండుకోవాలంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అస్సామీ తీపి వంటకం ఓ వైపు మెత్తగా, మరోవైపు కరకరలాడుతూ తమాషాగా ఉంటుంది. శీతాకాలం తినవలసిన ఈ వంటకం ఎలా వండుకోవాలంటే..


కావలసిన పదార్థాలు: బియ్యం: 3 కప్పులు, నల్ల నువ్వులు: 150 గ్రాములు, బెల్లం: 200 గ్రాములు, నీళ్లు: సరిపడా


తయారీ విధానం: బియ్యం శుభ్రంగా కడిగి, నీళ్లు నింపి 7 గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లన్నీ ఒంపేసి, తడిగా ఉన్నప్పుడే మెత్తగా అరిసెల పిండిలా దంచుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకుని తడి బట్ట కప్పి ఉంచుకోవాలి. నువ్వులను నూనె లేకుండా వేయించుకుని, పొడి కొట్టుకోవాలి. బెల్లం తరిగి, నువ్వుల పొడి కలిపి పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం వేడి చేసి, తడిగా ఉన్న బియ్యం పిండిని వేసి, చేత్తో వెడల్పుగా అద్దాలి. దీని పైన బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని ఉంచి,  బియ్యం రొట్టెను రెండు వైపుల నుంచీ లోపలికి మడవాలి. ఈ పీఠాను తిరగేసి, కాల్చి తీయాలి. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

Updated Date - 2021-11-06T18:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising