లక్సా
ABN, First Publish Date - 2021-09-18T19:21:20+05:30
రొయ్యలు - రెండు, చికెన్ - పావు కప్పు, నూడుల్స్ - పావు కప్పు, చికెన్ స్టాక్ - ఒక కప్పు, లక్సా పేస్ట్ - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు - ముప్పావు కప్పు, పుదీనా, కొత్తిమీర - కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.
ఇది నూడుల్స్ సూప్. సింగపూర్‌లో ఎక్కువ మంది ఇష్టంగా లాగిస్తారు. దీని తయారీకి...
కావలసినవి: రొయ్యలు - రెండు, చికెన్ - పావు కప్పు, నూడుల్స్ - పావు కప్పు, చికెన్ స్టాక్ - ఒక కప్పు, లక్సా పేస్ట్ - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు - ముప్పావు కప్పు, పుదీనా, కొత్తిమీర - కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.
లక్సా పేస్టు కోసం: వెల్లుల్లి రెబ్బలు - ఐదు, పచ్చిమిర్చి - ఐదారు, ఎండుమిర్చి - ఐదారు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, రొయ్యల పేస్టు - అర టేబుల్‌స్పూన్, పసుపు - ఒక టేబుల్‌స్పూన్, వేరుశనగలు - ఒక కప్పు.
గార్నిష్ కోసం: చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు - ఒక టేబుల్‌స్పూన్(దంచి వేగించినవి), ఉల్లిపాయలు - ఒక టేబుల్‌స్పూన్(వేగించినవి), వేరుశనగలు - ఒక టేబుల్‌స్పూన్(పొట్టు తీసి దంచినవి), కోడిగుడ్డు - ఒకటి(ఉడికించినది), కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం: రొయ్యలను, చికెన్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. నూడుల్స్‌ను నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి. తరువాత లక్సా పేస్టు తయారుచేసుకోవాలి. ఇందుకోసం మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, రొయ్యల పేస్టు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, పసుపు, వేరుశనగలు, కొత్తిమీర మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక లక్సా పేస్టు వేయాలి. తరువాత కొబ్బరిపాలు వేసి కలపాలి. కాసేపు ఉడికిన తరువాత చికెన్ స్టాక్ వేసుకోవాలి. మరుగుతున్న సమయంలో ఉప్పు వేసి రొయ్యలు, చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత నూడుల్స్ వేసి మరికాసేపు ఉడికించాలి. పుదీనా, కొత్తిమీర వేయాలి. చివరగా చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, వేరుశనగలు, కోడిగుడ్డు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-09-18T19:21:20+05:30 IST