కోఫ్తా ఔర్ దహీ కి కాడీ
ABN, First Publish Date - 2021-07-17T17:59:09+05:30
మాంసం - పావుకేజీ, పెరుగు - అరకేజీ, శనగపిండి - నాలుగైదు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - ఒక టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, అల్లం - అర అంగుళం ముక్కలు ఎనిమిది, పచ్చిమిర్చి - రెండు, ఎండుమిర్చి - నాలుగైదు, పసుపు - అర టీస్పూన్, నూనె
కావలసినవి: మాంసం - పావుకేజీ, పెరుగు - అరకేజీ, శనగపిండి - నాలుగైదు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - ఒక టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, అల్లం - అర అంగుళం ముక్కలు ఎనిమిది, పచ్చిమిర్చి - రెండు, ఎండుమిర్చి - నాలుగైదు, పసుపు - అర టీస్పూన్, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: మీట్ బాల్స్ తయారుచేసుకోవడం కోసం మాంసంలో ఒక టేబుల్‌స్పూన్ శనగపిండి, కొద్దిగా కారం, తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో నిమ్మకాయ సైజులో చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తరువాత నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని అందులో మిగిలిన శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత పెరుగు మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా వేగించిన పెట్టుకున్న మీట్ బాల్స్ వేసి దింపుకోవాలి. అన్నంతో సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-07-17T17:59:09+05:30 IST