నర్గీసి కబాబ్ కా కుర్మా
ABN, First Publish Date - 2021-07-17T18:20:16+05:30
కోడిగుడ్లు - ఆరు, బోన్‌లె్‌స మటన్ - 200గ్రా, ఉల్లిపాయ - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, కారం - ఒక టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, పెరుగు - అరకప్పు, శనగలు - ఒక టేబుల్‌స్పూన్, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, ఖుస్‌ఖుస్
కావలసినవి: కోడిగుడ్లు - ఆరు, బోన్‌లె్‌స మటన్ - 200గ్రా, ఉల్లిపాయ - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, కారం - ఒక టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, పెరుగు - అరకప్పు, శనగలు - ఒక టేబుల్‌స్పూన్, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, ఖుస్‌ఖుస్ - ఒక టేబుల్‌స్పూన్, పుచ్చకాయ విత్తనాలు - ఒక టేబుల్‌స్పూన్, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం: కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. మటన్‌ను కుక్కర్‌లో వేసి, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత మెత్తటి పేస్టులా చేసుకోవాలి. శనగలను వేగించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మటన్ పేస్టులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో కోడిగుడ్డును తీసుకుని చుట్టూ మటన్ పేస్టును పెట్టాలి. స్టవ్‌పై నూనె పెట్టి వేడి అయ్యాక నూనెలో వేసి ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఖుస్‌ఖుస్, పుచ్చకాయ విత్తనాలను వేగించి పొడి చేసుకోవాలి. గ్రేవీ కోసం స్టవ్‌పై మరో పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు పుచ్చకాయ విత్తనాల పొడి వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు పెరుగు వేయాలి. కాసేపయ్యాక ఒక కప్పు నీళ్లు పోయాలి. గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా కబాబ్‌లను మధ్యలో కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. వాటిపైన గ్రేవీ పోయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చపాతీ లేక అన్నంతో సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-07-17T18:20:16+05:30 IST