ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాస్ట్‌ మినిట్‌ చికెన్‌!

ABN, First Publish Date - 2021-06-05T15:02:55+05:30

వెల్లుల్లి పొడి: 2 టీస్పూన్లు, ఉల్లి పొడి: ఒకటిన్నర టీస్పూను, కారం: 2 టీస్పూన్లు, ఆరిగానో: 2 టీస్పూన్లు, మిరియాల పొడి: ఒకటిన్నర టీస్పూను, కొషెర్‌ సాల్ట్‌: 1 టీస్పూను, బోన్‌లెస్‌ చికెన్‌: ఒక కిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(తయారీ సమయం: 15 నిమిషాలు)


వంటకు ఎక్కువ సమయం లేనప్పుడు, చివరి నిమిషంలో చిటికెలో తయారుచేసుకోదగిన చికెన్‌ రెసిపీ ఇది.


కావలసిన పదార్థాలు: వెల్లుల్లి పొడి: 2 టీస్పూన్లు, ఉల్లి పొడి: ఒకటిన్నర టీస్పూను, కారం: 2 టీస్పూన్లు, ఆరిగానో: 2 టీస్పూన్లు, మిరియాల పొడి: ఒకటిన్నర టీస్పూను, కొషెర్‌ సాల్ట్‌: 1 టీస్పూను, బోన్‌లెస్‌ చికెన్‌: ఒక కిలో, ఆలివ్‌ ఆయిల్‌: 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర: ఒక కట్ట


తయారీ విధానం: వెల్లుల్లి పొడి, ఉల్లి పొడి, కారం, ఆరిగానో, మిరియాల పొడి, ఉప్పు ఓ గిన్నెలో కలుపుకోవాలి. చికెన్‌ ముక్కలను ప్లేట్‌లో పరిచి సగం పొడిని చల్లుకుని, ముక్కలను తిరగేసి మిగిలిన పొడి చల్లుకోవాలి. మసాలా ముక్కలకు పట్టేలా వేళ్లతో చికెన్‌ ముక్కలను రుద్దుకోవాలి.


గ్రిల్‌ ఇలా!

నాన్‌స్టిక్‌ గ్రిల్‌ ప్యాన్‌ను మీడియం మంట మీద ఉంచి, ప్యాన్‌ మీద ఆలివ్‌ ఆయిల్‌ చలుకోవాలి. సగం చికెన్‌ ముక్కలను ప్యాన్‌ మీద పరుచుకోవాలి. ముక్కల మధ్య ఎడం ఉండేలా చూసుకోవాలి. కలపకుండా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్‌ ముక్కలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలాగే మిగతా చికెన్‌ను కూడా గ్రిల్‌ చేసుకోవాలి. కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-06-05T15:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising