మంచూరియా
ABN, First Publish Date - 2021-08-07T18:18:22+05:30
చేప ముక్కలు - పావుకిలో, నూనె - సరిపడా, కార్న్‌స్టార్చ్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, మైదా - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, సోయాసాస్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, మిరియాల పొడి - పావు టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు -
కావలసినవి: చేప ముక్కలు - పావుకిలో, నూనె - సరిపడా, కార్న్‌స్టార్చ్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, మైదా - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, సోయాసాస్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్, మిరియాల పొడి - పావు టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు - మూడు, ఉల్లిపాయ - ఒకటి, గ్రీన్ క్యాప్సికం - ఒకటి, రెడ్ క్యాప్సికం - ఒకటి, వెనిగర్ - ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ సాస్ - ఒక టేబుల్‌స్పూన్, పంచదార - ఒక టీస్పూన్, నీళ్లు - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ఒక బౌల్‌లో టేబుల్‌స్పూన్ సోయాసాస్ తీసుకుని అందులో రెడ్ చిల్లీసాస్, పంచదార, వెనిగర్ వేసి సాస్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలను శుభ్రంగా కడిగి వాటిపై మిగిలిన సోయాసాస్, అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి వేసి కలుపుకొని పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆ ముక్కలపై కార్న్ స్టార్చ్, మైదా, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవాలి. చేప ముక్కలకు ఈ మిశ్రమం లేయర్‌లా పట్టేలా కలపాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె వేసి వేడి అయ్యాక చేప ముక్కలు వేసి వేగించుకోవాలి. స్టవ్‌పై మరొక పాన్ పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు వేయాలి. తరువాత రెడీ చేసి పెట్టుకున్న సాస్ వేసి కలియబెట్టాలి. కొద్దిగా నీళ్లు పోయాలి. సాస్ ఉడుకుతున్న సమయంలో వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేయాలి. రెండు నిమిషాల పాటు ఉడికించుకుని దింపుకోవాలి. ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-08-07T18:18:22+05:30 IST