ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భునా యాతా నల్లీ బిర్యానీ

ABN, First Publish Date - 2021-11-13T19:11:54+05:30

మటన్‌ నల్లీ - 2 పీస్‌లు, రిఫైండ్‌ ఆయిల్‌ - తగినంత, ఉల్లిపాయలు (తరిగినది)- 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 20 గ్రాములు, కారం- 10 గ్రా., పెరుగు- 40 గ్రా, గరం మసాలా పొడి- 5 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: మటన్‌ నల్లీ తయారీ కోసం...

మటన్‌ నల్లీ - 2 పీస్‌లు, రిఫైండ్‌ ఆయిల్‌ -  తగినంత, ఉల్లిపాయలు (తరిగినది)- 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 20 గ్రాములు, కారం- 10 గ్రా., పెరుగు- 40 గ్రా, గరం మసాలా పొడి- 5 గ్రాములు, జీలకర్ర పొడి - 5 గ్రాములు, ధనియాల పొడి - 8 గ్రాములు, ఉప్పు - తగినంత


బిర్యానీ రైస్‌ కోసం...

బాసుమతి బియ్యం - 150 గ్రాములు, రిఫైండ్‌ ఆయిల్‌ - తగినంత, షా జీరా - 5 గ్రాములు, యాలికలు - 2, అనాసపువ్వు - 1, నల్లమిరియాలు- 5 గ్రాములు, బిర్యానీ ఆకు- 1, పాలు - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- తగినంత, నిమ్మరసం - తగినంత, నీరు -పావు లీటరు 


తయారీ విధానం: మటన్‌ నల్లీ సిద్ధం చేయడం...

ఓ పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు మటన్‌ నల్లీ వేసి కొన్ని నిమిషాలు మగ్గనివ్వాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసి, బాగా కలియతిప్పాలి. ఓ నిమిషం మగ్గనిచ్చి దానికి రెండు కప్పుల నీరు జొడించి సన్నటి సెగపై 20-25 నిమిషాలు ఉడికించాలి. నీరు ఇంకి చిక్కబడిన తరువాత పాన్‌ పొయ్యిమీద నుంచి దింపి పక్కన పెట్టాలి.


బిర్యానీ రైస్‌ తయారీ: బాస్మతి బియ్యం నీటిలో అరగంట నానబెట్టి, అనంతరం నీటిని బయటకు వదిలేయాలి. మందపాటి అడుగు కలిగిన పాన్‌ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా  జోడించి, వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి, నెమ్మదిగా పాత్రలో ఓ నిమిషం బాగా కలియతిప్పాలి. ఆ తర్వాత నీళ్లు,  పాలు పోయాలి. బియ్యం నాణ్యతను బట్టి నీరు ఎక్కువ లేదంటే తక్కువ కలపవచ్చు. ఇప్పుడు నిమ్మరసం చిలకరించి, పాన్‌ మూత మూసివేయాలి.  బియ్యం ఉడికే వరకూ ఉంచాలి. బియ్యం ఉడికిన తరువాత నల్లీ మసాలా, రైస్‌ రెండూ మిక్స్‌ చేసి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు అలంకరించి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-11-13T19:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising