రొయ్యలు క్రిస్పీగా..
ABN, First Publish Date - 2021-01-03T18:06:19+05:30
రొయ్యలు - అరకేజీ, కార్న్‌స్టార్చ్ - అరకప్పు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్, ఎగ్‌వైట్స్ - మూడు, కొబ్బరి తురుము - రెండు కప్పులు, నూనె - సరిపడా,
నయా సాల్... నయా టేస్ట్
కొత్త ఏడాది అన్నీ కొత్తగానే చేయాలనుకుంటాం. అలానే కొత్త రుచులను ఆస్వాదించాలనుకుంటాం. ఎగ్‌ప్లాంట్ స్టీక్స్, మొజరెల్లా గోబీ కోఫ్తా, కోకొనట్ మాక్రూన్స్, స్వీడిష్ మీట్‌బాల్స్... వంటి వెరైటీ వంటకాలు అలాంటివే. ఇంకేం వీటిని వండివార్చి ఇంటిల్లిపాది రుచుల విందు చేసుకోండి మరి...
కావలసినవి: రొయ్యలు - అరకేజీ, కార్న్‌స్టార్చ్ - అరకప్పు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్, ఎగ్‌వైట్స్ - మూడు, కొబ్బరి తురుము - రెండు కప్పులు, నూనె - సరిపడా, స్వీట్ రెడ్ చిల్లీ సాస్ - కొద్దిగా, పంచదార - రెండున్నర టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ఒక పాత్రలో కార్న్‌స్టార్చ్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత అందులో రొయ్యలు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టాలి. మరొక పాత్రలో ఎగ్‌వైట్స్ తీసుకోవాలి. ఇంకో పాత్రలో కొబ్బరి తురుము, పంచదార వేసి కలియబెట్టాలి. ఇప్పుడు రొయ్యలు ఒక్కోటి తీసుకుంటూ ఎగ్‌వైట్‌లో డిప్ చేస్తూ కొబ్బరి తురుము అద్దాలి. వీటిని బేకింగ్ షీట్‌లో పెట్టి పైన కవర్ వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక రొయ్యలు వేసి వేగించాలి. ఈ క్రిస్పీ రెసిపీ రెడ్ చిల్లీ సాస్‌తో తింటే రుచిగా ఉంటుంది.
Updated Date - 2021-01-03T18:06:19+05:30 IST