ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లేటు బిర్యానీ రూ. 20 వేలు.. ఎక్కడో తెలుసా?

ABN, First Publish Date - 2021-02-25T20:51:44+05:30

మీరు బిర్యానీ ప్రియులు అయితే ఈ వార్త తప్పకుండా మీకోసమే. అంతేకాదు, తప్పకుండా చదవి తీరాల్సిన వార్త కూడా. సాధారణంగా బిర్యానీ అనగానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మీరు బిర్యానీ ప్రియులు అయితే ఈ వార్త తప్పకుండా మీకోసమే. అంతేకాదు, తప్పకుండా చదవి తీరాల్సిన వార్త కూడా. సాధారణంగా బిర్యానీ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆ తర్వాత లక్నో. అయితే, ఇప్పుడీ బిర్యానీ ప్రపంచవ్యాప్తమైపోయింది. ఇక, ఇప్పుడు చెప్పబోయే బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దుబాయ్‌లోని ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ఇప్పుడు ‘బాంబే బరో’ పేరుతో లగ్జరీ హోటల్‌గా మారిపోయింది. ఇటీవలే ప్రారంభమైన ఈ హోటల్‌లో బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది.


‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో అందించే ఈ బిర్యానీ ప్లేట్ ధర ఎంతో తెలుసా? 1,000 దిర్హమ్‌లు. భారత కరెన్సీలో రూ. 19,704 మాత్రమే. హోటల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా మెనూలో దీనిని చేర్చారు. మూడు కేజీల ఈ బిర్యానీని పెద్ద గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో సర్వ్ చేస్తారు. ఇందులో చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్/శాఫ్రాన్ రైస్‌ వేరియంట్లు లభిస్తాయి. బేబీ ఆలుగడ్డలు, ఉడకించిన గుడ్లతో అలంకరిస్తారు. 


అలాగే, కశ్మీరీ ల్యాంబ్ సీక్ కెబాబ్స్, పాత ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, రాజ్‌పుట్ చికెన్ కెబాబ్స్, ముఘలాయ్ కోఫ్తాలు, మలాయ్ చికెన్ వంటివాటిని బిర్యానీపై అలంకరించి అందిస్తారు. అన్నింటికంటే అతి ముఖ్యమైన, ఖరీదైన విషయం ఏమిటంటే.. బిర్యానీ ప్లేటు మొత్తాన్ని 23 కేరెట్ల బంగారం రేకులతో అలంకరిస్తారు. దీంతో ఆ బిర్యానీకి ఎక్కడలేని కళ వచ్చేస్తుంది. రాయల్ లుక్‌తో నోరూరుస్తుంది. అంతేకాదు, దీంతో పాటు మూడు సైడ్ డిష్‌లను కూడా సర్వ్ చేస్తారు. ఇందులో నిహారీ సాలన్, జోధ్‌పురి సాలన్, బాదామి సాస్‌లను బాదం, దానిమ్మ రైతాతో అందిస్తారు. 


ఈ ప్లేట్‌ సర్వ్ చేసేందుకు 45 నిమిషాలు పడుతుంది. బంగారు రంగు ఆప్రాన్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు అతిపెద్ద బిర్యానీ ప్లేట్‌ను తీసుకొస్తారు. ఇది ఒక్కటి నలుగురి నుంచి ఆరుగురికి ఎంచక్కా సరిపోతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనే ఎంచక్కా వెళ్లి ఆరగించొచ్చు. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదూ.. మీరు దుబాయ్‌లోనే ఉంటే కనుక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉన్న ఈ బాంబే బరోకు వెళ్లి దాని సంగతేంటో తేల్చుకుని వచ్చేయొచ్చు. మీరింకెక్కడైనా ఉంటే మాత్రం దుబాయ్ వెళ్లేటప్పుడు తప్పకుండా సందర్శించాల్సిన, మీ ప్లానింగులో ఒకటి కావాల్సిన హోటల్. 

Updated Date - 2021-02-25T20:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising