క్యారెట్ పచ్చడి
ABN, First Publish Date - 2021-12-16T19:08:57+05:30
క్యారెట్ ముక్కలు - ఒకటిన్నర కప్పులు, అల్లం- పెద్ద ముక్క, ఆవాలు- ముప్పావు స్పూను, ఎండు మిర్చి -
కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు - ఒకటిన్నర కప్పులు, అల్లం- పెద్ద ముక్క, ఆవాలు- ముప్పావు స్పూను, ఎండు మిర్చి - ఒకటి, ఇంగువ- పావు స్పూను, కరివేపాకు రెబ్బలు - పది, కారం పొడి- రెండు స్పూన్లు, పసుపు- పావు స్పూను, మెంతి పిండి- పావు స్పూను, నిమ్మరసం- రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: ఓ పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి అల్లం, క్యారెట్ ముక్కల్ని వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో మూడు స్పూన్ల నూనె వేసి కాస్త కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేయించాలి. చిటపటలాడాక కారం, పసుపు, మెంతి పిండి వేసి బాగా కలిపి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమంలోనే వేయించిన క్యారెట్, అల్లం ముక్కల్ని కలిపి నిమ్మరసం పిండితే క్యారెట్ పచ్చడి సిద్ధం.
Updated Date - 2021-12-16T19:08:57+05:30 IST