ఆలూ మేతీ
ABN, First Publish Date - 2021-12-08T19:12:23+05:30
మెంతి ఆకులు - నాలుగు కప్పులు, ఆలు గడ్డ- నాలుగు, పచ్చి మిర్చి ముక్కలు- రెండు స్పూన్లు, నూనె- రెండు స్పూన్లు, ఇంగువ- చిటికెడు, పసుపు- అర స్పూను, ఉప్పు- తగినంత.
కావలసిన పదార్థాలు: మెంతి ఆకులు - నాలుగు కప్పులు, ఆలు గడ్డ- నాలుగు, పచ్చి మిర్చి ముక్కలు- రెండు స్పూన్లు, నూనె- రెండు స్పూన్లు, ఇంగువ- చిటికెడు, పసుపు- అర స్పూను, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం: ఆలుగడ్డల పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఆలుగడ్డ ముక్కలను వేయించాలి. కాస్త రంగు మారాక పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు వేయాలి. ఇందులోనే మెంతి ఆకులు, ఉప్పు వేసి కలియబెట్టాలి. అయిదు నిమిషాలు అలాగే ఉడికిస్తే ఆలూ మేతీ తయారు. ఆలు గడ్డలు ఉడకనట్టుగా అనిపిస్తే కాస్త నీళ్లు వేసి మూత పెడితే సరి.
Updated Date - 2021-12-08T19:12:23+05:30 IST