ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌

ABN, First Publish Date - 2021-11-27T18:58:22+05:30

బీట్‌రూట్‌లు - రెండు, ఉసిరికాయలు - రెండు, పచ్చిబఠాణీలు - అరకప్పు, స్వీట్‌కార్న్‌ - అరకప్పు, బంగాళదుంప - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండున్నర టేబుల్‌స్పూన్లు, కారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: బీట్‌రూట్‌లు - రెండు, ఉసిరికాయలు - రెండు, పచ్చిబఠాణీలు - అరకప్పు, స్వీట్‌కార్న్‌ -  అరకప్పు, బంగాళదుంప - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - రెండున్నర టేబుల్‌స్పూన్లు, కారం - అరటీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత.


తయారీ విధానం: బీట్‌రూట్‌లను, బంగాళదుంపను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. ఉసిరికాయలను మెత్తగ చేసుకోవాలి. పచ్చిబఠాణీలను ఉడికించి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. స్వీట్‌కార్న్‌ను ఉడికించి మెత్తగా చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో గుజ్జుగా చేసుకున్న బీట్‌రూట్‌, ఉసిరికాయల గుజ్జు, పచ్చిబఠాణీల గుజ్జు, స్వీట్‌కార్న్‌ గుజ్జు తీసుకుని అందులో బియ్యప్పిండి, కొత్తిమీర, కారం, గరంమసాల, వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బంతుల్లా చేసుకోవాలి. ఒక్కో బంతిని తీసుకుంటూ చేతితో కట్‌లెట్‌లా ఒత్తుకుంటూ నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఏదైనా చట్నీతో వేడి వేడి కట్‌లెట్స్‌ సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-11-27T18:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising