మంగళూరు బోండా
ABN, First Publish Date - 2021-12-16T19:20:00+05:30
మైదా- కప్పు, వరి పిండి- అర స్పూను, అల్లం ముక్కలు- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, కరివేపాకు
కావలసిన పదార్థాలు: మైదా- కప్పు, వరి పిండి- అర స్పూను, అల్లం ముక్కలు- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, కరివేపాకు, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము- కప్పు, పుల్ల పెరుగు- ఆరు స్పూన్లు, చక్కెర- స్పూను, సోడా - చిటికెడు, నీళ్లు, నూనె, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో మైదా, వరి పిండి, పుల్ల పెరుగు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, కొబ్బరి, ఉప్పు, చక్కెర బాగా కలపాలి. కాస్త జారుగా ఉండేందుకు కొద్దిగ నీళ్లను కలిపి మూత పెట్టి మూడు గంటలు పక్కన బెట్టాలి. ఆ తరవాత పాన్‌లో నూనెను కాచి ఈ పిండిని బోండాల్లా నూనెలో వేసి తీస్తే సరి.
Updated Date - 2021-12-16T19:20:00+05:30 IST