మసాలా తమలపాకుల వడలు
ABN, First Publish Date - 2021-07-31T18:37:05+05:30
మసాలా తమలపాకులు - పన్నెండు, బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్, శనగపిండి - 4 టేబుల్‌స్పూన్లు,
కావలసినవి: మసాలా తమలపాకులు - పన్నెండు, బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్, శనగపిండి - 4 టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, నువ్వులు - ఒక టీస్పూన్, వాము - అర టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, కారం - రుచికి సరిపడా, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.
తయారీ విధానం: ముందుగా తమలపాకులను శుభ్రంగా కడగాలి. ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నువ్వులు, వాము, కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేయాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తమలపాకుపై లేయర్‌లా వేసి రోల్‌లా చుట్టాలి. రోల్ విడిపోకుండా పుల్లతో గుచ్చాలి. ఈ రోల్స్‌ను స్కిల్లెట్‌పై టోస్ట్ చేసుకోవాలి. తరువాత ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-07-31T18:37:05+05:30 IST