మెంతి పకోడీ
ABN, First Publish Date - 2021-11-06T19:26:05+05:30
పూర్వీకులు రుతువులు, కాలాల ఆధారంగా వంటలు చేసేవారు. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది. ఇప్పటికీ ఆ పద్ధతులు కొనసాగుతున్నాయి. చలికాలంలో కొన్ని ప్రాంతాల్లో చేసుకునే వింటర్‌ఫుడ్స్ ఏంటో కూల్‌గా మీరూ ఓ లుక్కేయండి.
వారెవ్వా...వింటర్ ఫుడ్స్!
పూర్వీకులు రుతువులు, కాలాల ఆధారంగా వంటలు చేసేవారు. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది. ఇప్పటికీ ఆ పద్ధతులు కొనసాగుతున్నాయి. చలికాలంలో కొన్ని ప్రాంతాల్లో చేసుకునే వింటర్‌ఫుడ్స్ ఏంటో కూల్‌గా మీరూ ఓ లుక్కేయండి.
చలి కాలంలో విరివిగా దొరికే మెంతి కూరను పప్పుకే పరిమితం చేయకుండా ఇలా పకోడీల్లో కూడా వాడుకోవచ్చు
కావలసిన పదార్థాలు: మెంతి కూర: 2 కప్పులు (శుభ్రంగా కడిగి, తరగాలి), ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి: 2 (సన్నగా తరగాలి), అల్లం: అర అంగుళం ముక్క (సన్నగా తరగాలి), పసుపు, ఉప్పు, కారం: సరిపడా, బేకింగ్ సోడా: చిటికెడు, శనగపిండి: ముప్పావు కప్పు
తయారీ విధానం: పెద్ద గిన్నెలో మెంతి ఆకు, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. చివర్లో శనగపిండి వేసి, పావు కప్పు నీళ్లు కలిపి కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా కలుపుకుని, మూత పెట్టి, ఐదు నిమిషాలు పక్కనుంచాలి. పిండి మరీ చిక్కగా కాకుండా, మరీ జారుడుగా కాకుండా మద్యస్థంగా ఉండాలి. మంట మధ్యస్తంగా ఉంచి, బాండీని ఉంచి, నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత పిండిని చిన్న ఉండలుగా వేస్తూ రంగు మారే వరకూ వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకూ వేయించి, టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. వేడిగా టమాటో చట్నీతో వడ్డించాలి.
Updated Date - 2021-11-06T19:26:05+05:30 IST