ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగాళదుంప ఉల్లిపాయ చీలా

ABN, First Publish Date - 2021-07-10T18:21:45+05:30

బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, శనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, గోధుమపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - కొద్దిగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: బంగాళదుంపలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, శనగపిండి - మూడు టేబుల్‌స్పూన్లు, గోధుమపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, వెన్న - కొద్దిగా. 


తయారీ విధానం: బంగాళదుంపలను సన్నగా, ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయను కట్‌ చేసుకోవాలి. కట్‌ చేసుకున్న బంగాళదుంప ముక్కలను చల్లని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఒక చిన్న బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో గోధుమపిండి, ఉల్లిపాయ, కారం, జీలకర్ర, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. తరువాత నీళ్లలో నానబెట్టిన బంగాళదుంపలను వేసి కలియబెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా వెన్న రాసి స్పూన్‌తో కాస్త మందంగా దోశలా పోసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి పొటాటో - ఆనియన్‌ చీలాను పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-07-10T18:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising