వేరుశనగల చాట్
ABN, First Publish Date - 2021-08-19T17:51:45+05:30
వేరుశనగలు- కప్పు, ఆలుగడ్డ - ఒకటి, టమోటా, ఉల్లి ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, కొత్తిమీర తురుము- పావు కప్పు, నిమ్మ రసం
కావలసిన పదార్థాలు: వేరుశనగలు- కప్పు, ఆలుగడ్డ - ఒకటి, టమోటా, ఉల్లి ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, కొత్తిమీర తురుము- పావు కప్పు, నిమ్మ రసం- స్పూను, ఆవాల పొడి- పావు స్పూను, మిరియాల పొడి, ఛాట్ మసాలా - స్పూను, నీళ్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా వేరుశనగలు, ఆలుగడ్డను ఉడికించుకోవాలి. ఉడికిన ఆలుగడ్డ, పచ్చి మిర్చిని కట్ చేసుకోవాలి. ఓ గిన్నె తీసుకుని అందులో వేరుశనగలు, కూరగాయల ముక్కలు, ఉప్పు, మసాలా పొడులు, నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. పైన కొత్తిమీర తురుమును అలంకరించాలి.
Updated Date - 2021-08-19T17:51:45+05:30 IST