రాజ్మా పకోడి
ABN, First Publish Date - 2021-07-24T17:50:10+05:30
రాజ్మా - పావుకేజీ, టొమాటోలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్,
కావలసినవి: రాజ్మా - పావుకేజీ, టొమాటోలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్, కారం - ఒక టీస్పూన్, ధనియాల పొడి - ఒక టీస్పూన్, గరంమసాల - ఒక టీస్పూన్, ఓట్స్ - 50గ్రా, బ్రెడ్‌క్రంబ్స్ - 30గ్రా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: రాజ్మాను రాత్రి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలను కట్ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరగాలి. నానబెట్టిన రాజ్మాను కుక్కర్‌లో వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత రాజ్మాను గుజ్జుగా చేయాలి. గుజ్జు చేసిన రాజ్మాలో ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తరువాత బ్రెడ్‌క్రంబ్స్, ఓట్స్ మిశ్రమంలో వేసి రోల్స్ చుట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పకోడి వేసి వేగించాలి. టొమాటో కెచప్‌తో లేక పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-07-24T17:50:10+05:30 IST