ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజ్ స్ప్రింగ్ రోల్స్

ABN, First Publish Date - 2021-12-18T17:56:51+05:30

స్ర్పింగ్‌ రోల్‌ రేపర్స్‌ - 12, స్ర్పింగ్‌ ఆనియన్స్‌ - నాలుగు, క్యాబేజ్‌ తురుము - ముప్పావు కప్పు, క్యారెట్‌ తురుము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: స్ర్పింగ్‌ రోల్‌ రేపర్స్‌ - 12, స్ర్పింగ్‌ ఆనియన్స్‌ - నాలుగు, క్యాబేజ్‌ తురుము - ముప్పావు కప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, బీన్స్‌ - అరకప్పు, క్యాప్సికం ముక్కలు - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, సోయాసాస్‌ - రెండు టీస్పూన్లు, చిల్లీ వెనిగర్‌ - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, మైదా - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, బీన్స్‌ వేసి వేయించాలి. కాసేపు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. మరికాసేపు వేగిన తరువాత క్యాబేజ్‌ తురుము, క్యారెట్‌ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉడికిన తరువాత మిరియాల పొడి, సోయాసాస్‌, వెనిగర్‌, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ స్టఫ్‌ రోల్స్‌లో పెట్టుకోవడానికి! ఒక బౌల్‌లో పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొంటూ మెత్తటి పేస్టులా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్‌లో స్ర్పింగ్‌ రోల్‌ రేపర్‌ని పరిచి ఒక వైపు చివరలో రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్‌ కొద్దిగా పెట్టాలి. తరువాత రేపర్‌ను చుట్టి చివర్లు మడవాలి. పేస్టులా చేసుకున్న పిండితో సీల్‌ చేయాలి. ఇలా అన్నీ రోల్స్‌ రెడీ చేసుకున్న తరువాత నూనెలో వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ఈ స్ర్పింగ్‌ రోల్స్‌ని టొమాటో కెచప్‌తో లేదా చిల్లీ సాస్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-12-18T17:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising