ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP NEWS: చిన్నారి కిడ్నీ మార్పిడికి 15 లక్షల సాయం

ABN, First Publish Date - 2022-10-30T04:54:59+05:30

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎ్‌సఏ సభ్యులు రూ.15 లక్షలు సాయంగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

child kidney transplant
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎస్‌ఏ స్పందన

లోకేశ్‌ చేతుల మీదుగా బాధితురాలి తండ్రికి చెక్‌ అందజేత

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స కోసం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎ్‌సఏ సభ్యులు రూ.15 లక్షలు సాయంగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ మొత్తాన్ని చెక్‌ రూపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేతుల మీదుగా బాధితురాలి తండ్రికి శుక్రవారం అందజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ కుమార్తె లాస్య కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దానిపై స్పందించిన లోకేశ్‌ సూచన మేరకు కోమటి జయరామ్‌ ఆధ్వర్యంలోని అమెరికాలోని టీడీపీ సభ్యులు ఔదార్యంతో రూ.15 లక్షలు సమీకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో లోకేశ్‌ చేతుల మీదుగా మురళీకృష్ణకు అందజేశారు. టీడీపీ కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎ్‌సఏ సభ్యులను లోకేశ్‌ ఈ సందర్భంగా అభినందించారు. టీడీపీ సీనియర్‌ నేత, అవనిగడ్డ టీడీపీ ఇన్‌చార్జి మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-30T04:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising