సమస్యల జంక్షన
ABN, First Publish Date - 2022-11-20T23:50:23+05:30
గుంతకల్లు డివిజన కేంద్రంలో ని రైల్వే స్టేషనలో పారిశుధ్యం లోపించి మురికి కూపంగా మా రింది. పారిశుధ్య కార్మికులు సగానికి తగ్గిపోగా ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హా ళ్లు దుర్గంధభరితంగా మారాయి.
ఫ మురికి కూపంగా గుంతకల్లు రైల్వేస్టేషన
ఫ పనిచేయని లిఫ్టులు, ఎస్కలేటర్లు
ఫ నిలిచిన వైఫై సేవలు
ఫ అధ్వానంగా కొటేషన వర్క్
ఫ ఇప్పటికే రద్దయిన శానిటేషన కాంట్రాక్టు
ప్రయాణికులకు తప్పని తిప్పలు
గుంతకల్లు, నవంబరు 20: గుంతకల్లు డివిజన కేంద్రంలో ని రైల్వే స్టేషనలో పారిశుధ్యం లోపించి మురికి కూపంగా మా రింది. పారిశుధ్య కార్మికులు సగానికి తగ్గిపోగా ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హా ళ్లు దుర్గంధభరితంగా మారాయి. ప్లాట్‌ఫాంలకు ఆనుకుని ఉన్న ట్రాక్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రైల్వే స్టేషన మొత్తం అపరిశుభ్రతగా మా రింది. లిఫ్టులు, ఎస్కలేటర్ పనిచేయకపోవడంతో సీనియర్ సిటిజన్లు, ది వ్యాంగులు ఇబ్బందు లు పడుతున్నారు. రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీ సుకుని దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న వైఫై వ్యవస్థ గుంతకల్లు స్టేషనలో ఆరు నెలల నుంచి పనిచేయ డం లేదు. రైల్వే డివిజన కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జంక్షన్లు, రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
వైఫై నైనై..!
దక్షిణ మధ్య రైల్వేలోని హాల్ట్ స్టేషన్లు మినహా దాదాపు 600 రైల్వే స్టేషన్లలో గత డిసెంబరులోనే వైఫై(ఇంటర్నెట్) సదుపాయాన్ని కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా గుంతకల్లు రైల్వే డివిజనలో 20 హాల్టు స్టేషన్లు మినహా వివిధ స్థాయిలో కలిగిన 114 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయాన్ని కల్పించారు. కానీ ఇది కేవలం ప్రచారార్భాటం మాత్రమే. రైల్వే డివిజన కేంద్రమైన గుం తకల్లు రైల్వే స్టేషనలో మాత్రం గత ఆరు నెలలుగా వైఫై అనేది లేకుండాపోయింది. రైల్వే స్టేషనలో ఉ న్న వైఫై బోర్డులను కూడా తొలగించారు. రైల్వే డివిజనలో వంద శాతం వైఫై సదుపాయం ఉందని ప్ర కటించకముందు దాదాపు రెండేళ్లపాటు ఇంటర్నెట్ కనెక్షన అందుబాటులో ఉంచారు.
పారిశుధ్య
కాంట్రాక్టు రద్దుతో సమస్య
రైల్వే స్టేషనలో ప్లాట్‌ఫాంలు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, ట్రాక్‌పై పారిశుధ్య పరిరక్షణకుగానూ రైల్వే శాఖ రెండేళ్ల క్రితం లక్నో నగరానికి చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు. ఆ కంపెనీ పనితీరు సక్రమంగా లేకపోవడంతో రైల్వే అధికారు లు పలుమార్లు హెచ్చరికలు చేశారు. అయినా పారిశుధ్య పనులకు నిబంధనలలో ఉన్నవిధంగా రసాయనాలను వాడకపోవడంతో జరిమానాలు కూడా విధించారు. సదరు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా ఉండం, కార్మికులకు సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో పారిశుధ్య పనులు మందగించాయి. ఆ కాంట్రాక్టు కం పెనీ జరిమానాలు చెల్లించకుండా, పనితీరును మార్చుకోనందున గత నెలలో కంపెనీ కాంట్రాక్టును రద్దు(టెర్మినేట్) చేశారు. ఇంకా నాలుగు నెలలు పాత కాంట్రాక్టు కంపెనీకి గడువు ఉన్నందున రైల్వే అధికారులు రైల్వే స్టేషనలో పారిశుధ్య పనుల కోసం నెల కిందట చెన్నైకి చెందిన ఎస్‌వీ అనే కంపెనీకి తాత్కాలికంగా 45 రోజులకు కొటేషన వర్కును కేటాయించారు. ఆ కంపెనీ పనితీరు కూడా మరింత అధ్వానంగా ఉంది. ఈ క్రమంలో రైల్వే స్టేషనలో పారిశుధ్య సమస్య తీవ్రతరమైంది. ఎక్కడ చూసినా చెత్తా, చెదారమే దర్శనమిస్తోంది. ప్లాట్‌ఫారాలు క్లీనింగ్‌కు నోచుకోక మురికి కూ పంగా మారాయి. కొత్త కాంట్రాక్టు కంపెనీ శానిటేషన సిబ్బందిని సగానికి తగ్గించేసింది. ప్లాట్‌ఫాంల క్లీనింగ్ వర్కు ల్లో యంత్రాలను వాడటంలేదు. ట్రాక్ యాప్రాన క్లీనింగ్‌కు వాటర్‌గన్స వాడటంలేదు. ప్లాట్‌ఫారాలను నీటితో శుభ్రపరచడం నిలిచిపోయింది. దీంతో ప్లాట్‌ఫాంలు దుర్గంధభరితమయ్యాయి. కాంట్రాక్టుల కేటాయింపులో అధికారులు ముడుపుల కోసం వెంపర్లాడుతూ పారిశుధ్యాన్ని నిర్లక్ష్యంచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్త కాంట్రాక్టరును నియమించడానికి మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ దుర్గంధాన్ని భరించాల్సిందేనా? అని ప్రయాణికులు వాపోతున్నారు.
పనిచేయని లిఫ్టులు, ఎస్కలేటర్లు
ప్రయాణికుల ఉపయోగం కోసం రైల్వే శాఖ ఎన్నో వసతులను కల్పిస్తోంది. ఈ క్రమంలో గుంతకల్లులోని అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకునేందుకు అత్యాధునిక లిఫ్టులను ఏర్పాటు చేశారు. అలాగే ఎ స్కలేటర్లను నిర్మించి ఐదు నెలల క్రితం ప్రారంభించారు. కానీ ఇప్పుడవి సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే 1వ ప్లాట్‌ఫాంపై, 4-5 ప్లాట్‌ఫారంపై లి ఫ్టులు నిలిచిపోయాయి. అన్ని ప్లాట్‌ఫారాలపై ఎస్కలేటర్లు ఉన్నా రైళ్లు వచ్చినప్పుడు కూడా వాటిని రన చేయించడంలేదు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉ న్నా ప్రయాణికులు లగేజిలతో పడుతూలేస్తూ మెట్లెక్కి వెళ్తున్నారు. రైళ్లు వచ్చినప్పుడు కూడా ఎస్కలేటర్లను రన చేయకపోతే ప్రయోజనమేమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2022-11-20T23:50:25+05:30 IST