ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెన్సర్‌ ఇక్కట్లు..!

ABN, First Publish Date - 2022-12-22T00:06:46+05:30

పెళ్లి చూపులకు వెళుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిన సిమెంటు లారీని ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ సమీప బంధువులు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం హరిపురం వై జంక్షన సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగిఉన్న సిమెంట్‌ లారీని ఢీకొన్న ఇన్నోవా కారు

ఇద్దరి మృతి..

ఆరుగురికి తీవ్ర గాయాలు

పెనుకొండ సమీపంలో దుర్ఘటన

పెనుకొండ రూరల్‌, డిసెంబరు 21: పెళ్లి చూపులకు వెళుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిన సిమెంటు లారీని ఇన్నోవా కారు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ సమీప బంధువులు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం హరిపురం వై జంక్షన సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న సత్యనారాయణ(55), నంజుండప్ప(75) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని పోలీసులు అస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపిన వివరాల మేరకు, పరిగి మండలం శ్రీరంగరాజులపల్లికి చెందిన మారుతి పెళ్లిచూపుల కోసం ఆయన తల్లిదండ్రులు శ్రీరాములు, నాగరత్నమ్మ, పెదనాన్న సత్యనారాయణ, బంధువులు పరిగి మండలం విట్టాపల్లికి చెందిన లక్ష్మమ్మ, కాలువపల్లికి చెందిన అశ్వత్థప్ప, అరుణ్‌, శ్రీరాములు, గొట్లాపురానికి చెందిన నంజుండప్ప, సౌభాగ్యమ్మ ఇన్నోవా వాహనంలో బుధవారం ఉ దయం 8 గంటలకు బయలుదేరారు. పరిగి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతున్న వీరి వాహనం పెనుకొండ సమీపంలో ఆగి ఉన్న సిమెంటు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఆర్‌ పల్లికి చెందిన స త్యనారాయణ, గొట్లాపురానికి చెందిన నంజుండప్ప అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మమ్మ, అశ్వర్థప్ప, నాగరత్నమ్మ, శ్రీరాములు, సౌభాగ్య, అరుణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో కారులో ప్రయాణిస్తున్న మారుతి, బంధువులు వెంటనే 108 వాహనానికి, పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. క్షతగాత్రులను 108లో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, రాకపోకలు పునరుద్ధరించారు. మృతిచెందిన నంజుండప్పకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సత్యనారాయణకు భార్య ఉంది.

Updated Date - 2022-12-22T00:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising