ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలకు పీఎంఎ్‌ఫబీవై వర్తింపు

ABN, First Publish Date - 2022-11-26T23:55:55+05:30

ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లల్లో పలు రకాల పంటలకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై) వర్తింపజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిగుబడి ఆధారంగా పరిహారం మంజూరు

అనంతపురం అర్బన, నవంబరు 26: ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లల్లో పలు రకాల పంటలకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై) వర్తింపజేశారు. కేంద్ర ప్రభుత్వం శనివారం జీఓను విడుదల చేసింది. పంట దిగుబడి ఆధారంగా నష్టం అంచనాలు లెక్కించి నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు చేయాలని నిర్ణయించారు. ఖరీఫ్‌ సీజనలో పత్తి పంటను గ్రామ యూనిట్‌గా తీసుకుంటారు. కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప పంటలను మండల యూనిట్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఖరీఫ్‌ సీజనలో హెక్టారుకు పత్తిరూ.90వేలు, కంది రూ.45వేలు, వరి రూ.95వేలు, జొన్న రూ.50వేలు, మొక్కజొన్న రూ.80వేలు, ఎండుమిరప రూ.2 లక్షలు పరిహారం వర్తింపజేయాలని నిర్ణయించారు. రబీ సీజనలో పప్పుశనగను గ్రామ యూనిట్‌, వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ (నీటిపారుదల) మండల యూనిట్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఆ సీజనలో పప్పుశనగ హెక్టారుకు రూ.70వేలు, వరి రూ.లక్ష, జొన్న రూ.50వేలు, మొక్కజొన్న రూ.80వేలు, వేరుశనగకు రూ.70వేల పరిహారం మంజూరు చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2022-11-26T23:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising