ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీతోనే ఈడిగల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-12-25T23:52:52+05:30

రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడితే మద్యం దుకాణాల్లో ఈడిగలకు 25 శాతం కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దాన్ని 50 శాతం ఇచ్చేవిధంగా ఒప్పిస్తాం’ అని మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు

పెనుకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారంలోకి వస్తే 50 శాతం మద్యం దుకాణాలు గీత కార్మికులకే..

మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌

అట్టహాసంగా ఈడిగ సాధికార కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం

పెనుకొండ, డిసెంబరు 25: ‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడితే మద్యం దుకాణాల్లో ఈడిగలకు 25 శాతం కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దాన్ని 50 శాతం ఇచ్చేవిధంగా ఒప్పిస్తాం’ అని మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఈడిగ సాధికార కమిటీల ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సభ్యులు, కులస్థులు తరలివచ్చారు. బ్యాన ర్లు, జెండాలు ప్రదర్శించారు. డ్రమ్ములు వాయి స్తూ దర్గా సర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఈడిగ సాధికార కమిటీ కన్వీనర్‌ నీళ్ల రమణ, డైరెక్టర్‌ల చేత టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా కేఈ ప్రభాకర్‌ మాట్లాడారు. తెలుగుదేశం పాలనలోనే ఈడిగ కులస్థులతో పాటు బీసీలందరూ రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ఎదిగారని తెలిపారు. ఈడి గ గౌడులందరూ ఐకమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని, చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఈడిగల కులవృత్తి కల్లు, సారా వ్యాపారంలోకి ఇతర సామాజిక వర్గాలు చొరబడ్డాయన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈడిగలను అన్నివిధాలా అభివృద్ధిపరిచేందుకు చంద్రబాబు కృషిచేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కులస్థులందరూ కృషి చేయాలన్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ బీసీల పునాదుల నుంచి పుట్టిందే తెలుగుదేశమన్నారు. ఈడిగలందరూ ఐకమత్యంతో పోరాటం చేయాలన్నారు. జగలేటి మల్లేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఈడిగల అభివృద్ధి కోసం ఇలాంటి సమావేశాలను పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం అతిథులను ఈడిగ సంఘం నాయకులు గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో మడకశిర మాజీ ఎ మ్మెల్యే ఈరణ్ణ, సాధికార సమితి అబ్జర్వర్‌ తాతా జయప్రసాద్‌, ఈడిగల కుల గురువు శివసాయిబాబా, ఈడిగ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌నాథ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు నీళ్లరమణ, బీసీసెల్‌ అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, ఐదు ఉప కులాల అబ్జర్వర్‌ జయప్రకాశ, నారాయణతాత, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, మాజీ ఎంపీపీ ఆదినారాయణ, కురుబ కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, బూతరాయప్ప, రామన్న, నరసింహమూర్తి, రామగిరి శ్రీనివాసగౌడ్‌, లేపాక్షి కన్వీనర్‌ జయప్ప, జగలేటి శ్రీనివాసులు, లావణ్య, హరినాథ్‌గౌడ్‌, అనసూయమ్మ, గోపీ, రామాంజనేయులు, పురుషోత్తంగౌడ్‌, మనోహర్‌, పవనకుమార్‌, మారుతి, శ్రీరాములు, అశ్వర్థప్ప, ఈడిగ కులస్థులు, గీత కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-25T23:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising