ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతికి గ్రహణం

ABN, First Publish Date - 2022-11-18T00:25:48+05:30

ప్రగతి పథంలో నడుస్తున్న అనంతపురం అర్బన బ్యాంకుకు రాజకీయ గ్రహణం పట్టింది. డిపాజిటర్లు, రుణగ్రస్థుల సంఖ్య పెరిగి.. బ్యాంకు టర్నోవర్‌ ఏకంగా రూ.750 కోట్లు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి, మరింత ముందుకు సాగాల్సింది పోయి.. ఏదో ఓ సాకుతో అడ్డుకుంటున్నారు. మొదట ఎన్నికలను నిర్వహించనీకుండా.. ఆ తరువాత ఫలితాలను ప్రకటించనీకుండా కోర్టుల చుట్టూ వ్యవహారాన్ని తిప్పడం పట్ల ఖాతాదారులు, వాటాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పద్ధతి మారాలని, లేదంటే డిపాజిట్లను ఉపసంహరిస్తామని ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయినా.. ఎవరూ స్పందించడం లేదు.

అర్బన బ్యాంకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్బన బ్యాంకు చుట్టూ రాజకీయం

మేలో ఎన్నికలు.. ఇంకా తేలని ఫలితాలు

ఆరు దఫాలుగా మహాజన సభ వాయిదా

ఖాతాదారులు, వాటాదారుల్లో ఆందోళన

ప్రగతి పథంలో నడుస్తున్న అనంతపురం అర్బన బ్యాంకుకు రాజకీయ గ్రహణం పట్టింది. డిపాజిటర్లు, రుణగ్రస్థుల సంఖ్య పెరిగి.. బ్యాంకు టర్నోవర్‌ ఏకంగా రూ.750 కోట్లు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి, మరింత ముందుకు సాగాల్సింది పోయి.. ఏదో ఓ సాకుతో అడ్డుకుంటున్నారు. మొదట ఎన్నికలను నిర్వహించనీకుండా.. ఆ తరువాత ఫలితాలను ప్రకటించనీకుండా కోర్టుల చుట్టూ వ్యవహారాన్ని తిప్పడం పట్ల ఖాతాదారులు, వాటాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పద్ధతి మారాలని, లేదంటే డిపాజిట్లను ఉపసంహరిస్తామని ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయినా.. ఎవరూ స్పందించడం లేదు.

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 17: అర్బన బ్యాంకు ఎన్నికలు జరిగి ఐదున్నర నెలలు గడిచింది. ఇప్పటికీ ఫలితాలపై స్పష్టత లేదు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికలు జరిగాయి. అసాధారణ పోలీసు బందోబస్తు కల్పించారు. మూడుసార్లు వాయిదా పడిన అనంతరం.. ‘ది అనంతపురం కో-ఆపరేటివ్‌ అర్బన బ్యాంకు’ పాలకవర్గం ఎన్నికలను మే 31న నిర్వహించారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల ప్రకటనను ఎనిమిది వారాలు పాటు వాయిదా వేశారు. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులు రెండు నెలల పాటు వేచి చూశారు. ఆ తరువాత కూడా ఫలితాల ప్రకటన దిశగా ఏ చర్యలూ తీసుకోలేదు. అర్బన బ్యాంకులో 12 డైరెక్టర్‌ స్థానాలకు 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6,972 ఓటర్లకు గాను 3,070 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 44.04 శాతం పోలింగ్‌ నమోదైంది. బ్యాలెట్‌ బాక్సులను కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచారు.

అడుగడుగునా అడ్డంకులు..

అర్బన బ్యాంకు ఎన్నికలకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. గత ఏడాది జూన నుంచి ఎన్నికలకు మూడుసార్లు నోటిఫికేషన ఇచ్చారు. కానీ అధికార పార్టీ వర్గీయులు, వారి ప్రత్యర్థివర్గాల విభేదాల నడుమ ఎన్నికలు జరగలేదు. కోర్టు ద్వారా, అధికారుల స్వయం నిర్ణయాధికారంతోనూ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. అన్ని అడ్డంకులనూ అధిగమించి, మే 31న పోలింగ్‌ పూర్తి చేశారు. కానీ ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్‌ జరపాలని ఒక వర్గం, వాయిదా వేయాలని మరో వర్గం పోలింగ్‌ రోజున ఆందోళనకు దిగాయి. హైకోర్టు విధించిన ఎనిమిది వారాల వాయిదా గడువు ఎప్పుడో ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

స్పందన ఏదీ..?

అనంతపురం టౌన బ్యాంకు.. అర్బనగా బ్యాంకుగా రూపాంతరం చెందిన తరువాత బ్యాంకు ప్రగతి బాటలో నడుస్తోంది. టర్నోరవ్‌ రూ.70 కోట్ల నుంచి సుమారు రూ.750 కోట్లకు పెరిగింది. ఈ మేరకు బ్యాంకులో డిపాజిట్లు, రుణాల సంఖ్యను పెంచారు. ఈ నేపత్యంలో ఎన్నికల ఫలితాలను విడుదల చేసి, బ్యాంకు అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ ఖాతాదారులు, వాటాదారులు సహకార శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌, డీసీఓ, ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని, లేదంటే డిపాజిట్లు మొత్తం వెనక్కు తీసుకుంటామని లేఖలో హెచ్చరించారు. అయినా రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా అధికార యంత్రాంగం నుంచి స్పందన లేదు.

ఆరు దఫాలు మహాజనసభ వాయిదా

సహకార చట్టం నిబంధనల ప్రకారం సహకార బ్యాంకులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మహాజన సభ నిర్వహించాలి. బ్యాంకు పురోగతిపై ఖాతాదారులు, వాటాదారులు ముందు నివేదిక ఉంచాలి. కానీ కోరం లేక ఆరు దఫాలుగా మహాజనసభ వాయిదా వేశారు. దీంతో బ్యాంకులో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. పాలకవర్గం లేని కారణంగా బ్యాంకు పురోగతి కుంటుపడుతోందని బ్యాంకులో చర్చ నడుస్తోంది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..

ఎన్నికల తరువాత కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన ఉన్నతాధికారులు, కోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశాం. మొదట ఎనిమిది వారాలు వాయిదా వేశారు. తరువాత పొడిగిస్తూ వచ్చారు. ఇప్పటికి సుమారు ఆరు నెలలు కావస్తోంది. బ్యాలెట్‌ బాక్సులు కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచాం. బ్యాలెట్‌ పెట్టెల భద్రత గురించి ఎటువంటి ఆందోళన లేదు. త్వరలో ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాలు ప్రకటిస్తాం.

- ప్రభాకర్‌రెడ్డి, డీసీఓ, అర్బన బ్యాంకు పర్సన ఇనచార్జి

Updated Date - 2022-11-18T00:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising