ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోతుల రోడ్లు

ABN, First Publish Date - 2022-12-19T23:45:51+05:30

నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. కంకర తేలి, అడుగుకో గుంత ఏర్పడ్డాయి. అవి గోతులుగా మారాయి.

కోతకు గురైన విరుప సముద్రం రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధంతరంగా ఆగిన నిర్మాణ పనులు

మరమ్మతుల జాడే లేదు

నరకప్రాయంగా ప్రయాణం

మడకశిర, డిసెంబరు 19: నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. కంకర తేలి, అడుగుకో గుంత ఏర్పడ్డాయి. అవి గోతులుగా మారాయి. మూడేళ్లుగా మరమ్మతులు కరువయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు రోడ్ల రూపురేఖలే మారిపోయాయి. పలుచోట్ల కోతకు గురై, కల్వర్టులు ధ్వంసమై ఆనవాళ్లు కోల్పోయాయి. తరచూ వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోతుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు సందర్భాల్లో గుంతల రోడ్లలో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. రోడ్లలోని గుంతలను మట్టితో నింపి, మూసేస్తున్నారు. కొన్ని రోజులకే ఆ మట్టి అంతా తేలిపోయి, యథాస్థితికి చేరుతోంది. దుమ్ముధూళితో నిండిన ఈ రోడ్లలో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.

అర్ధంతరంగా ఆగిన రోడ్డు పనులు

అమరాపురం-విరుపసముద్రం 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరైంది. ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. ఈ మార్గంలో 4 కిలోమీటర్ల మేర కంకర పరిచి, వదిలేశారు. అక్కడితో పనులను నిలిపివేశారు. ఆరు నెలలు కావస్తున్నా రోడ్డు నిర్మాణం పడకేసింది. ఈరెండు గ్రామాల ప్రజలు కంకర తేలిన రోడ్డు గుండా ప్రయాణించాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు రూ.3 కోట్ల వరకు పనులు జరిగినా, కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదు. దీంతో రోడ్డు నిర్మాణం అటకెక్కిందని స్థానికులు వాపోతున్నారు.

శాఖల నడుమ సమన్వయలోపం

రోడ్ల నిర్మాణానికి పలు శాఖల నడుమ సమన్వయం కొరవడింది. పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ పరిధిలోకి, ఆర్‌అండ్‌బీ పరిధి నుంచి హైవే పరిధిలోకి పలుచోట్ల రోడ్లను కేటాయించారు. ఈ రోడ్ల రూపురేఖలు మాత్రం మారలేదు. కొడికొండ నుంచి హిందూపురం, మడకశిర మీదుగా రొళ్ల, కర్ణాటకలోని శిరా వరకు జాతీయ రహదారి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 90 శాతం నిర్మాణాలు చేపట్టారు. హిందూపురం రోడ్డు, మధుగిరి రోడ్డు ఆర్‌ఆండ్‌బీ పరిధి నుంచి హైవే పరిధిలోకి మారాయి. దీంతో ఈ రోడ్డు మరమ్మతులు, నిర్మాణ పనులు హైవే అధికారులు చేపట్టాల్సి ఉంది. రెండేళ్లుగా ఆ ఊసే లేదు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని పెనుకొండ, పావగడ రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. పెద్దపెద్ద గుంతలు ఏర్పడి, తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్లకు మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-19T23:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising