ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-11-02T23:13:03+05:30

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు

హిందూపురం అర్బన, నవంబరు 2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు ఆరోపించారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ డిమాండ్లపై ఆర్‌ఐ చందుకు వినతి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహించడమే కాకుండా నిర్వీర్యం చేస్తున్నాయని ఆగ్రహించారు. చేనేత రంగాన్ని దివాళా తీసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ముడిసరుకులపై జీఎస్టీ రుద్దుతూ ఉత్పత్తులను దెబ్బదీసి, ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల కడుపు కొడుతున్నాయన్నారు. ఇప్పటికీ చాల మంది చేనేత కార్మికులకు సొంత ఇల్లు లేవని బాడుగల ఇల్లలో ఉంటు అద్దె చెల్లించలేని దీనావస్తలో ఉన్నారని ఆవేదన చెందారు. ఉన్న సరుకు అమ్ముడుపోక, గిట్టుబాటు ధర దక్కక, చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి100 యూనిట్ల వరకు విద్యుత అందించి ప్రభుత్వాలే సహకరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం హిందూపురం అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి, పి. రమేష్‌, కోశాధికారి బి. రమేష్‌, సహాయ కార్యదర్శి ఎల్లప, హరి, ఉపాఽధ్యక్షులు సంగమేష్‌, కార్మిక సంఘం నాయకులతో పాటు ఆటో యూనియన నాయకులు వీరికి మద్దతు తెలిపారు.

Updated Date - 2022-11-02T23:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising