ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరక ప్రయాణం..!

ABN, First Publish Date - 2022-11-06T23:32:39+05:30

గ్రామీణ రహదారులు ఆధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధ్వానంగా గ్రామీణ రహదారులు

క్రిష్ణంరెడ్డిపల్లి నుంచి చియ్యేడుకు వెళ్లే రోడ్డు పై ఉన్న గుంతలు

అనంతపురంరూరల్‌,నవంబరు6: గ్రామీణ రహదారులు ఆధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రజాప్రతినిధులు గ్రామీణ రహదారుల బాగోగుల గురించి పట్టించుకోవడమే లేదు. మండలంలోని ఎ.నారాయణపురం, కొడిమి నుంచి నర్సనేకుంటా గ్రామానికి వెళ్లే రోడ్డు, రాచానపల్లి నుంచి దర్గా కొట్టాలకు వెళ్లే రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు స్థానికంగా వంకపై నిర్మించిన బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అటువైపు వెళ్లే కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాచానపల్లి నుంచి అక్కంపల్లికి వెళ్లే దారి ఇదే విధంగా ఉంది. అలాగే కళ్యాణదుర్గం -అనంతపురం ప్రధాన రహదారి నుంచి అక్కంపల్లికి వెళ్లే రోడ్డు కంకర తేలి పెద్ద పెద్ద రాళ్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసినా పనులు కార్యరూపం దాల్చలేదు. చిన్నంపల్లికి వెళ్లే దారి ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైంది. దానిని పట్టించుకునేవారు కరువైయ్యారు. ఇక కృష్ణంరెడ్డిపల్లి నుంచి చియ్యేడుకు వెళ్లే రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్లు స్థానికులు చెప్పుకొస్తున్నారు.

Updated Date - 2022-11-06T23:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising