కురుబ కులాన్ని బజారుకీడ్చిన ఎంపీ మాధవ్: టీడీపీ
ABN, First Publish Date - 2022-08-13T04:54:33+05:30
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చే సిన పనికి మాలిన పనితో కురుబ సామాజిక వర్గాన్ని బజారుకీడ్చాడని టీడీపీకి చెందిన కురుబ కులస్థులు మండిపడ్డారు.
హిందూపురం, ఆగస్టు 12: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చే సిన పనికి మాలిన పనితో కురుబ సామాజిక వర్గాన్ని బజారుకీడ్చాడని టీడీపీకి చెందిన కురుబ కులస్థులు మండిపడ్డారు. శుక్రవా రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో టీడీపీ నాయకులు, లేపాక్షి మాజీ ఎంపీపీ ఆనంద్, ఐ-టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు రామాంజనేయులు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వీరశేఖర్, టీఎనఎ్‌సఎఫ్ ఉపాధ్యక్షులు అభిలాష్, శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు. కుల రాజకీయా లు మానుకోవాలని హితవుపలికారు. మాధవ్ చేసిన పనివల్ల కు రుబ కులస్థులను అప్రతిష్టపాలు చేశారన్నారు. చంద్రబాబు నా యుడు. నారాలోకేశను విమర్శించడం తప్ప.. ఎంపీ మాధవ్ ఏమి ఒరగబెట్టారని ప్రశ్నించారు. మీడియాను తిట్టిపోస్తున్న మాధవ్‌ను... అదే మీడియా ఒకప్పుడు అతన్ని పొగడలేదా అని ప్రశ్నించారు. ఎంపీ వికృత చేష్టలతో కులాల మధ్య చిచ్చు పెడుతూ మాట్లాడ టం సిగ్గుచేటన్నారు. మూడేళ్ళ కాలంలో ఎంపీగా ఉంటూ ఎన్ని ని ధులు తెచ్చావు, ఏమి అభివృద్ధి చేశావో నియోజకవర్గ ప్రజలకు స మాధానం చెప్పాలన్నారు. కురుబ సామాజిక వర్గానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. వ్యక్తిగత రాజకీయాల కోసం కులాన్ని అంటగట్ట డం సిగ్గుచేటన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రాజకీయంగా కురుబ కులస్థులే దెబ్బతీస్తారన్నారు. సమావేశంలో నాయకులు అంజి, కిష్టప్ప, భూషణ్, కురుబ కులస్థులు పాల్గొన్నారు.
మాధవ్‌పై మండిపడ్డ కురుబ యువత
ఎంపీ గోరంట్ల మాధవ్ వికృతచేష్టలపై హిందూపురానికి చెందిన కురుబ కులం యువకులు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక కనకదాస కల్యాణమండపంలో సమావేశమైన కురుబ యువకులు మా ట్లాడారు. గోరంట్ల మాధవ్ మా కులస్థుడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందన్నారు. ఆయన వెంటనే కులానికి క్షమాపణ చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా వైసీపీ ఎంపీ మాధవ్ చేసిన పనివల్ల మేము తలదించుకుంటున్నామన్నారు. సంస్కారవంతంలేని అతన్ని ఎంపీగా గె లిపించడమే సిగ్గుచేటన్నారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు కురుబ కులస్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. చేసిన పనిని కప్పి పుచ్చుకోవడానికి ఇతరులపై నెట్టడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో టీడీపీ పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి అంజి, గంగాధర్ పాల్గొన్నారు.
ప్రజలు ఛీకొడుతున్నా సిగ్గులేదా.. మాధవ్!
కురుబ కృష్ణమూర్తి
పెనుకొండ: ‘వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనికి యా వత భారతదేశం ఛీదరించుకుంటోంది. సిగ్గులేకుం డా చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటు’ అని టీడీపీ నాయకుడు, కురుబ సం ఘం జిల్లా నాయకులు కృష్ణమూర్తి తీ వ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. సభ్యసమాజం సిగ్గుపడేలా ఎంపీ మాధవ్ చేసిన పనివల్ల కురుబ కులస్థులు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. చేసిన పనికి పశ్చాత్తాప పడకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుమాలిన చర్యలన్నారు. ఎక్కడి నుంచో వచ్చి జిల్లాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడం మంచిదికాదన్నారు. ఇలాగే కొనసాగితే మూ టముల్ల సర్దుకోవాలని, ప్రజలు మాధవ్‌ను జిల్లా నుంచి తరమడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
Updated Date - 2022-08-13T04:54:33+05:30 IST