ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంక్షనలో రైల్వే జీఎం

ABN, First Publish Date - 2022-11-30T00:18:40+05:30

గుత్తి రైల్వే జంక్షనలో మంగళవారం రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన పర్యటించారు. సికింద్రబాదు నుంచి ప్రత్యేక రైలులో గుత్తికి చేరుకున్న ఆయన రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్‌ను రైల్వే స్టేషన నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. కాలనీలోని మురుగు నీటిని శుద్ధి చేసి పైప్‌లైన ద్వారా చెట్లకు వినియోగించే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గుత్తి రైల్వే స్టేషనలో పర్యటిస్తున్న జీఎం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ప్రారంభం..

బైపాస్‌ లైన తనిఖీ

గుత్తి, నవంబరు 29: గుత్తి రైల్వే జంక్షనలో మంగళవారం రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన పర్యటించారు. సికింద్రబాదు నుంచి ప్రత్యేక రైలులో గుత్తికి చేరుకున్న ఆయన రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్‌ను రైల్వే స్టేషన నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. కాలనీలోని మురుగు నీటిని శుద్ధి చేసి పైప్‌లైన ద్వారా చెట్లకు వినియోగించే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా గుత్తి బైపాస్‌ స్టేషనను రూ.48 కోట్లతో నుంచి నూతనంగా నిర్మించిన రైల్వే లైన పనులను ఆయన పరిశీలించారు. కర్నూలు గేట్‌ వద్ద ఆయన సోలార్‌ పంపును ప్రారంభించారు. అనంతరం క్యాబిన వద్ద రైల్వే ఫోర్ట్‌ స్టేషన వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని మార్పులు చేస్తూ సూచనలు ఇచ్చారు. బైపాస్‌ లైనకు సంబందించిన మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రైలులో నూతనంగా నిర్మించిన ట్రాక్‌ను పరిశీలిస్తూ తాడిపత్రికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం వెంకటరమణా రెడ్డి, కనక్షన డీఈ వరుణ్‌ బాబు, సీనియర్‌ డీఈ ట్రాక్షన సుదర్శన రెడ్డి, డీఎంఈ పుష్పారాజ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గుత్తి మీదుగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపాలి

ప్రజా సౌకర్యార్థం గుత్తి మీదుగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ను నడపాలని పెద్దవడుగురుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ రెడ్డి, ప్రజలు, జీఎంకు విన్నవించారు. గతంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లే కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌, కుర్లా, కొయంబత్తూరు వెళ్లే ఎక్స్‌ప్రె్‌సలను గూళ్లపాళ్యం మీదుగా నడుపుతున్నారని వీటిని గుత్తి మీదుగా నడపాలని కోరారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను గుత్తిలో స్టాపింగ్‌ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, 3, 4 ప్లాట్‌ఫాంలను త్వరతగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-11-30T00:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising