Sri Sathyasai Dist.:సత్యసాయిబాబా చిత్రపటం నుంచి విభూది
ABN, First Publish Date - 2022-11-24T16:15:33+05:30
శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ, సోమందేపల్లి, వినాయక్‌నగర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ, సోమందేపల్లి, వినాయక్‌నగర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. మధుమోహన్, మంజుల దంపతుల ఇంట్లో ఉన్న సాయిబాబా (Saibaba) చిత్రపటం నుంచి విభూది రాలుతోంది. దీంతో బాబా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పుట్టపర్తి సత్యసాయిబాబా మహత్యమేనని కుటుంబసభ్యులు అంటున్నారు.
బాబా భక్తురాలు మంజుల సంకీర్తనకు నగిరి వెళ్లారు. అక్కడివారు సత్యసాయి చిత్రపటాన్ని ఇచ్చారు. స్వామివారి జయంతి కావడంతో గుడిలో ఉంచి పూజలు చేశారు. దీంతో స్వామి దివ్యపటం నుంచి విభూది రాలడం మొదలయ్యిందని, తమ ఇంటిలో ఈ విధంగా జరగడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సాయిబాబా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
Updated Date - 2022-11-24T21:32:48+05:30 IST