ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన

ABN, First Publish Date - 2022-12-24T23:38:24+05:30

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సస్పెండ్‌ చేసినట్లు జిల్లా పంచా యతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ ఒక ప్రకటనలో శనివారం తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం, సిటీ, డిసెంబరు 24: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సస్పెండ్‌ చేసినట్లు జిల్లా పంచా యతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ ఒక ప్రకటనలో శనివారం తెలియజేశారు. విడపనకల్లు మండల పరిధిలోని కొనకొండ-2 గ్రామ సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఎస్‌ చరణ్‌కుమార్‌, కరకముక్కల గ్రామ సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ జి. గణేష్‌, విడపనకల్లు-2 సచి వాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఎస్‌ శ్వాతి, పాల్తూరు -2 సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఆర్‌. రాజేష్‌ నాయక్‌, వేల్పుమడుగు సచివాలయం ఇంజనీరింగ్‌ అసి స్టెంట్‌ సి. మమతను సస్పెండ్‌ చేశారు. ఈనెల 9వ తేదీన గుంతకల్లు డివిజన పరిధిలోని అధికారులు, సచివా లయ ఉద్యోగులతో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సమీక్ష నిర్వహిం చారు. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్‌శాఖ, జిల్లా గృహ నిర్మాణశాఖ విధులు, ఆయా భవనాల నిర్మాణాల పరంగా విధుల్లో అలసత్వం వహించిన 15 సచివాలయ ఉద్యో గులకు అదే రోజున కలెక్టర్‌ మెమోలు జారీ చేశారు. ఆయి తే కొందరు ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేనందున ఐదుగురిని సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఇదిలా ఉండగా.. సస్పెండ్‌ ఆయిన కొందరు ఉద్యోగులు తగిన వివరణ నివేదిక అందజేసి నప్పటికి ఆశాఖ ఉన్న తాధికారులకు అందలేదనే నెపంతో ఇద్దరిని సస్పెండ్‌ చేసి నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన వివర ణను సంబందిత ఎంపీడీఓ కార్యాల యంలో ఆశాఖ ఉన్న తాధికారులకు పంపలేదని తెలిసింది.

అంగనవాడీ పోస్టులకు 191 దరఖాస్తులు

అనంతపురం విద్య, డిసెంబరు 24: జిల్లావ్యాప్తంగా 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగనవాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులకు 191 దరఖా స్తులు వచ్చినట్లు పీడీ శ్రీదేవి శనివారం ఒకప్రకటనలో తెలిపారు. 11 అంగనవాడీ వర్కర్‌ పోస్టులు, ఒకమినీ అంగనవాడీ వర్కర్‌ పోస్టుకు కలిపి 42 దరఖాస్తులు వచ్చాయన్నారు. 68 అంగనవాడీ హెల్పర్‌ పోస్టులకు 149 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. 80 పోస్టులకు కలిపి 191 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-24T23:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising