ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వమంతా నారాయణ సేవ

ABN, First Publish Date - 2022-11-20T23:54:32+05:30

సత్యసాయి శతజయంతి వేడుకల నాటికి విశ్వమంతా నారాయణసేవ నిర్వహిస్తామని సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీ్‌షపాండే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, డాక్టర్‌ మోహన, నిమీ్‌షపాండే విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యసాయి సేవాసంస్థల

జాతీయ అధ్యక్షుడు నిమీ్‌షపాండే

ఘనంగా లక్షార్చన

పుట్టపర్తి, నవంబరు 20: సత్యసాయి శతజయంతి వేడుకల నాటికి విశ్వమంతా నారాయణసేవ నిర్వహిస్తామని సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీ్‌షపాండే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌, చక్రవర్తి, డాక్టర్‌ మోహన, నిమీ్‌షపాండే విడుదల చేశారు. ఆదివారం మూడోరోజు సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా లక్షార్చన కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. అనంతరం నిమీ్‌షపాండే మాట్లాడుతూ అన్నార్థులకు అన్నదాన సేవలోనే సత్యసాయి సేవ ఉందని అదే సాయికి నిజమైన సేవయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సేవాసంస్థలు వేల మందికి నారాయణ సేవలను అందిస్తున్నాయన్నారు. రోజూ పదిలక్షల మందికి నారాయణసేవ అందించడమే లక్ష్యంగా 2025 నాటికి విశ్వవ్యాప్తం చేయాలని లక్ష్యంగా సేవాసంస్థలు, భక్తులు పని చేయాలన్నారు. కొవిడ్‌ కష్ట కాలంలో 13 లక్షల మందికి నారాయణసేవ అందించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సాయిభక్తులు ఉన్నారనీ, ప్రతిరోజు ఒకపేదవాడికి నారాయణసేవ అందించాలని కోరారు. సత్యసాయి సూచించిన యోగాతో త్యాగం వస్తుందనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. సేవా సంస్థలలోని ప్రతి సభ్యుడు నారాయణసేవను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోషల్‌మీడియాలో, మీడియాలో ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య లక్షార్చన కార్యక్రమాన్ని భక్తితో నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని, బియ్యంతో సత్యసాయి చిత్రపటానికి అర్చన చేశారు. సాయంత్రం ప్రముఖ గాయకుడు దేవశిష్‌ భట్టాచార్య బృందం సంగీత కచేరితో భక్తులను అలరింపజేసింది. మహామంగళహారతి అనంతరం వేలాది మంది భక్తులు.. మహాసమాధి దర్శనం చేసుకున్నారు.

Updated Date - 2022-11-20T23:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising