ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపయోగంగా ఎస్సీ భవన సముదాయం

ABN, First Publish Date - 2022-11-28T00:03:55+05:30

ఎస్సీ కులాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు నిర్మించిన వ్యాపార భవన సముదాయం బోసి పోయింది. వ్యాపారంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పట్టణంలో కాంప్లెక్స్‌ నిర్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ టౌన, నవంబరు 27: ఎస్సీ కులాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు నిర్మించిన వ్యాపార భవన సముదాయం బోసి పోయింది. వ్యాపారంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పట్టణంలో కాంప్లెక్స్‌ నిర్మించారు. ఈగదులు నామమాత్రపు అద్దెకు ఇచ్చి ప్రోత్స హించాలని సంకల్పించారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్‌ సమస్యల వలయంలో చిక్కుకుంది. పెనుకొండ ప్రధాన కూడలి అంబేడ్కర్‌ సర్కిల్‌వద్ద 9 గదులతో ఎస్సీ కాంప్లెక్స్‌ భవన సముదాయాన్ని నిర్మించారు. ఇందులో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలంటే అనంతపురం పెన్నార్‌ భవనలోని ఎస్సీ కార్పొరేషనలో దరఖాస్తు చేసుకోవాలి. వారికి నిబంధనల మేరకు నెలకు రూ.500 అద్దెకు గదులు ఇచ్చేలా ప్రతిపాదన లు చేశారు. అయితే పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరిగాయి. అందులోభాగంగా నాలుగులేన్ల రోడ్లకు ఆనుకుని ఉన్న ఈకాంప్లెక్స్‌ భవనం కొంతభాగాన్ని తొలగించారు. దీంతో కాంప్లెక్స్‌ పైఅంతసు ్తలోని గదులకు ఉన్న మెట్లు కూల్చారు. పైకివెళ్లేందుకు దారిలేక ఇ బ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కాంప్లెక్స్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు..

నరసింహమూర్తి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు

గత యేడాది జిల్లా స్పందనలో ఎస్సీ కాం ప్లెక్స్‌ భవన సముదాయం సమస్యలపై రాతపూర్వకంగా వినతిపత్రం అందించా. నేటికీ ప ట్టించుకున్న పాపానపోలేదు. నామమాత్రంగా ఇంజనీర్‌ వచ్చి వెళ్లాడు. కాంప్లెక్స్‌కు నీరు, మ రుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. మెరుగైన సదు పాయాలు కల్పిస్తే ఎస్సీలు లబ్ధి పొందుతారు.

Updated Date - 2022-11-28T00:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising