ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూపర్‌ స్పెషాలిటీకి నీటి కష్టాలు

ABN, First Publish Date - 2022-11-06T23:39:33+05:30

జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత రెండు నెలలుగా నీటి సమస్యతో చికిత్స పొందుతున్న రోగులు అవస్థలు పడుతు న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల, మూత్ర విసర్జనకు రోగుల తిప్పలు

ఆపరేషన చేసుకున్నోళ్లు ఆరుబయటకు

పట్టించుకోని పర్యవేక్షణాధికారులు

అనంతపురం టౌన: జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత రెండు నెలలుగా నీటి సమస్యతో చికిత్స పొందుతున్న రోగులు అవస్థలు పడుతు న్నారు. శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులు మలవిసర్జనకు ఆరుబయటకు సీసాలలో నీళ్లు తీసుకొని వెళ్లాలంటే ముప్పుతిప్పలు పడుతున్నారు. అయినా ఆస్పత్రి పర్యవేక్షణ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాగడానికి మాత్రం క్యానలలో నీటిని తెప్పిస్తున్నారని, మిగతా అవసరాలు ఎలా తీర్చుకోవాలని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.120 కోట్లతో నిర్మించినా...

జిల్లా కేంద్రంలోని శారదానగర్‌లో రూ.120కోట్లకు పైగా ఖర్చుపెట్టి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. టీడీపీ హయాంలో దాదాపు 80శాతం నిర్మాణాలు పూర్తి అయింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగా ఈ ఆస్పత్రికి కష్టాలు మొదలయ్యాయి. మూడేళ్లపాటు పట్టించుకోలేదు. అదిగోఇదిగో అంటూ కాలం గడుపుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆరు నెలల క్రితం సూపర్‌స్పెషాలిటీలో వైద్యసేవలు ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం జరగలేదు. కొంత మందిని నియమించి వారితోనే సేవలు ప్రారంభించారు. న్యూరో, కార్డియాలజీ(గుండె), కిడ్నీ డాక్టర్లను ఏర్పాటు చేయడంతో రోగులు కూడా వెళుతూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల న్యూరో కార్డియాలజీ, కిడ్నీ బాధితులు ఎక్కువగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి వస్తున్నారు. సీరియస్‌ కేసులకు డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రికి గత రెండు నెలలుగా నీటి ఎద్దడి ఏర్పడింది. ఎక్కడో కనెక్షన పాడైపోవడంతో ఆస్పత్రిలోకి నీరు రావడం లేదు. దీంతో తాగునీటితో పాటు మూత్ర, మల విసర్జనకు రోగులు అవస్థలు పడుతున్నారు.

సీసాలతో ఆరుబయటకు రోగులు...

సూపర్‌స్పెషాలిటీలో చికిత్స పొందుతున్న రోగులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరఫరా నిలిచి పోవడంతో మరుగుదొడ్లకు నీరు రావడం లేదు. దీంతో మూత్ర, మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఆపరేషన చేయించుకున్న వారు నడవలేక మూత్రం టాయ్‌లెట్లలో అలాగే పోస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తున్నాయి. మరోవైపు మలవిసర్జనకు సీసాలలో నీరు తీసుకొని నడవలేని పరిస్థితిలో అవస్థలు పడుతూ ఆరుబయటకు వెళుతున్నారు. ఈ నరకం నిత్యం పర్యవేక్షణాధికారులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది చూస్తున్నారేగాని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అక్కడ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పాలకులు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని రోగుల కష్టాలు తీర్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-11-06T23:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising