ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?

ABN, First Publish Date - 2022-10-29T23:35:11+05:30

రైల్వేస్టేషన నిర్మాణ పనుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత బోర్డు ప్రమాదకరంగా ఉంది. దీని వల్ల అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ హుబ్లీ డీఆర్‌ఎం హర్ష ఖరే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఆర్‌ఎం ముందు రైల్వే సమస్యలు వివరిస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వే అధికారులపై డీఆర్‌ఎం ఆగ్రహం

రాయదుర్గం రైల్వే స్టేషన సందర్శన

రాయదుర్గం, అక్టోబరు 29: ‘రైల్వేస్టేషన నిర్మాణ పనుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత బోర్డు ప్రమాదకరంగా ఉంది. దీని వల్ల అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ హుబ్లీ డీఆర్‌ఎం హర్ష ఖరే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన బళ్లారి నుంచి రాయదుర్గం మీదుగా కదిరి దేవరపల్లి వరకు రైల్వే స్టేషనలతో పాటు రైల్వేలైన పరంగా సమస్యలను అధ్యయనం చేశారు. రాయదుర్గం స్టేషనను సందర్శించి కొత్తగా నిర్మిస్తున్న స్టేషన ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరిశీలించారు. కొత్త స్టేషన వద్ద కాంట్రాక్టర్‌ నేలపై ఏర్పాటు చేసిన విద్యుత బోర్డు వల్ల చిన్నపిల్లలకు అపాయం సంభవించే ప్రమాదం ఉందని, ఇన్ని రోజులు ఎలా అనుమతించారని రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బోర్డును తొలగించాలని ఆదేశించారు. స్టేషన నిర్మాణం వల్ల పక్కనే ఉన్న వరదనీటి కాలువ సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరంతా ఇళ్లల్లోకి చేరుతోందని ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి దీనిపై అధ్యయనం చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలను తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపే విషయంపై పరిశీలిస్తానన్నారు. ఆర్థికంగా ఆదాయం లభించే స్టేషనలపై ఎక్కువ దృష్టిపెడతామని వివరించారు. బెంగళూరు నుంచి రాకపోకలు సాగించే రైలు సమయాలను ప్రయాణికులకు అనుకూలంగా పగటిపూట మార్చాలని పలువురు కోరారు. అనంతరం రైల్వే స్టేషనలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సీనియర్‌ డీఎంఈ పీకే శర్మ, రైల్వే అధికారులు కృష్ణచైతన్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-10-29T23:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising