భక్తిశ్రద్ధలతో కాలభైరవుడికి పూజలు
ABN, First Publish Date - 2022-10-26T23:41:28+05:30
మండల కేంద్రం లోని కస్తూర్బా పాఠశాల సమీ పంలోని నూతన కాలనీలో గతంలో పంపిణీ చేసిన పట్టాలలోని స్థలా లను అధికార పా ర్టీకి చెందిన కొందరు ఆక్రమిం చుకుని ఇళ్లనిర్మా ణం చేపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
ముదిగుబ్బ, అక్టోబరు 26: మండల కేంద్రం లోని కస్తూర్బా పాఠశాల సమీ పంలోని నూతన కాలనీలో గతంలో పంపిణీ చేసిన పట్టాలలోని స్థలా లను అధికార పా ర్టీకి చెందిన కొందరు ఆక్రమిం చుకుని ఇళ్లనిర్మా ణం చేపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అర్హులైన పేదలను గుర్తించి న్యాయం చేయాలని తహసీల్దార్ నాగేంద్రకు విన్నవించారు. టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్, తెలుగుయువత మండలాధ్యక్షుడు వినోద్ బాబు, నాయకులు సూర్యశేఖర్‌రాజు, వాటర్ ఆనంద్ తదితరులు బుధవారం తహసీల్దార్ నాగేంద్రను కలిశారు. గతంలో పేదలకు ఇచ్చినపట్టాలను అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా రని ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలను ఆపి పేదలకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన తహసీల్దార్ రికార్డులను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - 2022-10-26T23:41:32+05:30 IST