ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే అనుచరుడిని...

ABN, First Publish Date - 2022-11-30T23:16:52+05:30

అధికార పార్టీ నాయకులు భూబకాసురుల్లా మారిపోయారు. ప్రభుత్వ భూములను పబ్లిక్‌గానే కబ్జా చేస్తున్నారు. ప్రైవేటు భూములనూ వదలట్లేదు. తాతల కాలం నుంచి వచ్చిన భూములను సైతం కబ్జా చేసేస్తున్నారు.

గుట్టకిందపల్లి వద్ద కబ్జాకు గురైన భూమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచె వేసేశా.. భూమి గురించి మరిచిపోండి

నన్నెవరూ ఏం చేసుకోలేరు..

ధర్మవరంలో వైసీపీ నాయకుడి దౌర్జన్యం

రూ.8 కోట్ల భూమి కబ్జా

భూ యజమానికి బెదిరింపులు

ధర్మవరం

అధికార పార్టీ నాయకులు భూబకాసురుల్లా మారిపోయారు. ప్రభుత్వ భూములను పబ్లిక్‌గానే కబ్జా చేస్తున్నారు. ప్రైవేటు భూములనూ వదలట్లేదు. తాతల కాలం నుంచి వచ్చిన భూములను సైతం కబ్జా చేసేస్తున్నారు. నిలదీసిన బాధితులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. బెదిరిస్తున్నారు. అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ధర్మవరంలో పాసుపుస్తకాలు చేయిస్తానని రైతును నమ్మించి, ఏకంగా భూమి మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు వైసీపీ నాయకుడు. నిలదీసిన బాధితుడిపై బెదిరింపులు, దౌర్జన్యానికి దిగుతున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. అధికార పార్టీ నాయకుడికే వత్తాసు పలుకుతున్నారనీ, ఈ ఆక్రమణలో వారి ప్రమేయం కూడా ఉందని బాధిత రైతు వాపోతున్నాడు. దీంతో రైతు చేసేదిలేక, తన పొలంలో అధికార పార్టీ నాయకుడు అక్రమంగా వేసిన కంచెను తొలగించాడు.

నమ్మించి.. మోసం..

ధర్మవరం పట్టణ పరిధి గుట్టకిందపల్లి సమీపాన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లికి చెందిన రైతు దయాల పుల్లప్పకు సర్వే నెంబరు 544లో 1.19 ఎకరాల భూమి ఉంది. ఇది తాతల కాలం నుంచి వారికి చెందినది. ప్రస్తుతం రూ.8 కోట్ల వరకు ధర పలుకుతోంది. భూమికి పాసుపుస్తకాలు చేయిస్తాననీ, అందుకు తనకు కొంచెం స్థలం ఉచితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరుడు ఈశ్వర్‌రెడ్డి బేరం కుదుర్చుకున్నాడు. పాసుపుస్తకాలు చేయించాలంటే ముందుగా తన పేరిట భూమిని రిజిస్ట్రేషన చేయించాలని రైతు పుల్లప్పను ఈశ్వర్‌ రెడ్డి అడిగాడు. ఇందుకు అంగీకరించిన పుల్లప్ప 40 సెంట్ల స్థలాన్ని ఈశ్వర్‌రెడ్డికి రిజిస్ట్రేషన చేసిచ్చాడు. అనంతరం ఈశ్వర్‌ రెడ్డి.. మండలానికి చెందిన ఓ రెవెన్యూ అధికారితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి బంధువుల పేరుమీద కూడా కొన్ని సెంట్ల భూమిని రిజిస్ట్రేషన చేయించి, మిగిలిన దానిని కూడా ఈశ్వర్‌రెడ్డి కాజేయాలని పన్నాగం పన్నాడు. రిజిస్ట్రేషన తతంగం పూర్తికాగానే సెంటు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు ధర పలుకుతోందని తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి మొత్తం 1.19 ఎకరాల భూమికి కంచె వేసేశాడు. దీంతో రైతు నిర్ఘాంతపోయాడు. రైతు పుల్లప్ప.. తన కుమారుడు మల్లికార్జున, కుమార్తె మల్లికతో కలిసి ఈశ్వర్‌రెడ్డిని నిలదీశారు. తాను ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుడిననీ, తనను ఎవరూ ఏమీ చేసుకోలేరనీ, భూమి మొత్తం తనదేనంటూ ఈశ్శర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగాడు. కొంతమందిని పంపి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత రైతు పుల్లప్ప వాపోయాడు. ఇకపై భూమి గురించి మరచిపోండనీ, తాను కంచె వేశాననీ, ఎవరూ ఏం చేసుకోలేరని భయాభ్రాంతులకు లోనుచేశాడని రైతు ఆవేదన చెందాడు. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోయాడు. దీంతో నాలుగురోజుల క్రితం ఈశ్వర్‌రెడ్డి వేసిన కంచెను కత్తిరించి, కొన్ని రాళ్లను కూడా తొలగించినట్లు పుల్లప్ప తెలిపాడు. తన భూమి ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటి ముందే పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకుంటానని రైతు పుల్లప్ప బోరున విలపించాడు.

Updated Date - 2022-11-30T23:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising