కేంద్రంలో పవన్ ఫ్రెండే ఉన్నారు కదా?: బొత్స
ABN, First Publish Date - 2022-11-27T15:42:03+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదైనా తెలుసుకొని మాట్లాడితే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదైనా తెలుసుకొని మాట్లాడితే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. కేంద్రంలో పవన్ ఫ్రెండే ఉన్నారు కదా.. వెళ్లి మాట్లాడొచ్చుగా అని బొత్స సూచించారు. ఇప్పటంలో ఏం జరిగిందో.. కోర్టు ఏం చెప్పిందో చూశామన్నారు. ఇప్పటం గ్రామానికి అభివృద్ధి అవసరం లేదా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు.
Updated Date - 2022-11-27T15:42:05+05:30 IST