ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నైట్ కర్ఫ్యూ నుంచి వీటికి మినహాయింపు

ABN, First Publish Date - 2022-01-11T18:51:47+05:30

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తాజాగా కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇస్తూ జీవో జారీ చేసింది.


ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మింహాయింపు ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని, వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.





Updated Date - 2022-01-11T18:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising