ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirmala Sitharaman: ‘‘నేను రాష్ట్రం పేరు చెప్పడంలేదు కానీ...

ABN, First Publish Date - 2022-12-22T02:36:53+05:30

ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పరోక్షంగా చురకలు అంటించారు. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీకి పరోక్ష చురకలు

పత్రికా ప్రకటనలకు మాత్రం భారీగా వ్యయం

తాయిలాలు సందర్భోచితంగా ఉండాలి

ఆదాయం ఉన్నప్పుడు ఇస్తే ఓకే

విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీలు సమర్థనీయమే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పరోక్షంగా చురకలు అంటించారు. ‘‘నేను రాష్ట్రం పేరు చెప్పడంలేదు. అయితే... ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని గత రెండు నెలలుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి’’ అని తెలిపారు. అంతేకాదు... జాతీయ స్థాయిలో ప్రకటనలకు నిధులు ఖర్చు పెడుతున్నందునే ఈ పరిస్థితి వచ్చిందేమో అని కూడా వ్యాఖ్యానించారు. ఏపీలో 15వ తేదీదాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్న సంగతి తెలిసిందే. ఇక... సీఎం జగన్‌ ఒకే పథకానికి పలుమార్లు ‘బటన్‌ నొక్కుతూ’, ప్రతిసారీ ప్రకటనలు జారీ చేస్తూ, సొంత మీడియాకు కోట్లు గుమ్మరిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ ప్రకటనల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ ఏపీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. రూ.3.50 లక్షల కోట్ల అదనపు వ్యయానికి సంబంధించిన అనుబంధ పద్దులపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఉచితాలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు, ఏపీలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ బుధవారం సమాధానమిచ్చారు. ‘మీ ఉచితాలు వర్సెస్‌ మా ఉచితాలు అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మీ పద్ధతుల్లో పారదర్శకత ఉన్నప్పుడు దానిపై చర్చే ఉండదు. చట్టబద్ధమైన ఆర్థిక నిబంధనల్లో పారదర్శకత అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ముఖ్యం. ఒక రాష్ట్రప్రభుత్వం తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని గత రెండు నెలలుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. నేను రాష్ట్రం పేరు చెప్పడం లేదు. బహుశా నిధులను దేశవ్యాప్తంగా ప్రకటనలు (అడ్వర్టైజ్‌మెంట్లు) ఇవ్వడానికి వినియోగిస్తున్నందునే జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. సబ్సిడీలు లేదా ఉచితాలు సందర్భోచితంగా ఉండాలి. ఆదాయం వస్తుంటే వాటిని బడ్జెట్‌లో చేర్చి డబ్బులు ఇవ్వండి. అలా చేస్తే ఎవరు అభ్యంతరపెడతారు? విద్య, వైద్యంతో పాటు రైతులకు సబ్సిడీలు అందించడం పూర్తిగా సమర్థనీయం. వాటితో ఎవరికీ సమస్య లేదు’ అని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టిన కాంగ్రెస్‌

కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌ చేసిన వ్యాఖ్యలపై నిర్మల ఘాటుగా స్పందించారు. ఆర్టికల్‌ 356 దుర్వినియోగ బాధిత పార్టీ నుంచి జాన్‌ వచ్చారన్నారు. ‘ఇందిరాగాంధీ 50 సార్లకుపైగా 356 అధికరణను దుర్వినియోగం చేశారు శాంతి భద్రతల పేరిట నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారు. 1984లో ఏపీలో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ డిస్మిస్‌ చేసింది.’ అని ధ్వజమెత్తారు.

ఈడీని నిందించొద్దు..

ప్రతిపక్షాలను అణచివేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులతో వేధిస్తోందనడం అవాస్తవమని నిర్మల స్పష్టం చేశారు. ఈడీని నిందించొద్దని కోరారు. బెంగాల్‌ మంత్రి ఇంట్లో గుట్టలుగుట్టలుగా ఉన్న డబ్బుపై మీడియాలో వచ్చిన ఫొటోలను సభలో ఆమె ప్రదర్శించారు. ఈ దశలో కొందరు విపక్ష ఎంపీలు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ధరలు పెరగడకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. అనంతరం అనుబంధ పద్దులను రాజ్యసభ ఆమోదించి లోక్‌సభకు పంపింది.

Updated Date - 2022-12-22T10:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising