ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ వారివా..? అయితే లాగేసుకోండి!

ABN, First Publish Date - 2022-10-27T00:05:48+05:30

గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను అధికార పార్టీవారు టార్గెట్‌ చేశారు. ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరతరాలుగా అనుభవంలో ఉన్న స్థలాలపై కుట్ర

ప్రభుత్వ స్థలాల పేరిట లాగేసుకునేందుకు యత్నం

అధికారులను ఉసిగొల్పుతున్న వైసీపీ నాయకులు

గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను అధికార పార్టీవారు టార్గెట్‌ చేశారు. ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఏళ్ల తరబడి టీడీపీ వర్గీయుల అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పొలాలను లాగేసుకునేందుకు పావులు కదువుతున్నారు. పశువుల పాకలు, వామి దొడ్డు, వ్యవసాయ భూములు.. ఇలా వేటీని వదలడం లేదు. అధికారులను ఉసిగొల్పి.. వైసీపీ నాయకులు చోద్యం చూస్తున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాతాల కాలం నుంచి తాము అనుభవంలో ఉంటున్నామని, అధికారులకు ఆధారాలు చూపించినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నా.. తమ అధీనంలో ఉన్నవాటిలోనే నిర్మాణాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారని, ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- రాయదుర్గం

గుమ్మఘట్ట మండలం నేత్రపల్లికి చెందిన జంగలి గోవిందప్ప, తన ఇంటి పక్కనే ఉన్న రెండు సెంట్ల ప్రభుత్వ పోరంబోకు భూమిలో తాతల కాలం నుంచి గడ్డి వామి వేసుకుంటున్నాడు. అందులోనే పశువుల కోసం చిన్నపాటి గుడిసె ఏర్పాటు చేశాడు. పశుపోషణపై ఆధారపడి వీరి కుటుంబం జీవిస్తోంది. ఇప్పుడు అధికారులు వచ్చి ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారని గోవిందప్ప వాపోతున్నాడు. ఎందుకు అని అడిగితే.. ప్రభుత్వ భవనాలకు అవసరమని అంటున్నారట. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ స్థలంలో వంక ప్రవహించింది. భవన నిర్మాణానికి ఏమాత్రం అనువుగాని స్థలం అది అని గోవిందప్ప అంటున్నాడు. అయినా సరే.. ఖాళీ చేయమని చెబుతున్నారని, తన ఉపాధికి ఎసరు పెట్టారని బాధితుడు కంటతడి పెడుతున్నారు. ఒక్క గోవిందప్ప మాత్రమే కాదు.. గ్రామంలో చాలామంది ఇలా ఖాళీ స్థలాలను వంశపారంపర్యంగా వినియోగించుకుంటున్నారు. చట్టప్రకారం ఆ స్థలాలపై వారికి హక్కు కల్పించాలి. కానీ అధికార పార్టీవారు టీడీపీ సానుభూతిపరుల్ని టార్గెట్‌ చేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఖాళీ చేయాలని హుకుం జారీ చేస్తున్నారు.

పదే పదే సర్వే

గుమ్మఘట్ట మండలంలోని శిరిగేదొడ్డికి చెందిన హరినాథ్‌ కుటుంబం తరతరలుగా 70 సెంట్ల పోరంబోకు భూమిని సాగు చేసుకుంటోంది. దశాబ్దాల నుంచి అనుభవంలో ఉన్న వీరిని అధికారపార్టీవారు టార్గెట్‌ చేశారు. హరినాథ్‌ సోదరులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పదే పదే తమ అధీనంలో ఉన్న పొలాన్ని సర్వే చేసి, రాళ్లు పాతుతున్నారని హరినాథ్‌ వాపోతున్నాడు. తాము సాగులో ఉన్న విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని, భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నాయకులు వెనుక ఉండి అధికారులను ఉసిగొల్పుతున్నారని వాపోతున్నాడు.

కోర్టును ఆశ్రయించాం..

మేము నివాసం ఉంటున్న ఇంటి పక్కన పది సెంట్ల దాకా స్థలం ఉంది. అందులో పశువుల మేతను నిల్వ చేసుకుంటున్నా ము. ఆ స్థలంలో సచివాలయ భవనం నిర్మించాలని అధికారులు అంటున్నారు. మమ్మల్ని ఖాళీ చేయించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గ్రామంలో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. అయినా మా స్థలంపైనే దృష్టిపెట్టారు. మాపై కక్షకు దిగారు. గతంలో మాకు ఇచ్చిన పట్టాలను కూడా అధికారులకు చాలాసార్లు చూపించాము. అవేమీ పట్టించుకోకుండా స్థలం ఖాళీ చేయించేందుకు పూనుకున్నారు. దీంతో కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతున్నాను.

- రమేష్‌, ఉద్దేహాళ్‌

Updated Date - 2022-10-27T00:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising