ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPS employees : సీపీఎస్‌ ఉద్యోగులకు అరెస్టు వారెంట్‌!

ABN, First Publish Date - 2022-10-28T06:30:47+05:30

సీపీఎస్‌ ఉద్యోగుల బతుకులతో జగన్‌ సర్కారు చెలగాటం ఆడుతోంది. దీనిపై సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరుగురికి జారీ చేసిన విజయవాడ కోర్టు

కేసుల రద్దు హామీపైనా సర్కారు నిర్లక్ష్యం ఫలితం

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ ఉద్యోగుల బతుకులతో జగన్‌ సర్కారు చెలగాటం ఆడుతోంది. దీనిపై సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో సీపీఎస్‌ ఉద్యోగులపై నమోదైన కేసులను వాపసు తీసుకున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలపకపోవడంతో ఆ కేసుల్లో ఆరుగురు ఉద్యోగులను అరెస్టు చేయాలంటూ తాజాగా విజయవాడ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని, నాటి ప్రభుత్వం సీపీఎస్‌ ఉద్యోగులపై పెట్టిన కేసులనూ ఎత్తివేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా సీపీఎ్‌సను రద్దు చేయలేదు. అయితే, గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్‌ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్లు 2020లోనే జీవో ఇచ్చినప్పటికీ, ఆ జీవోను కోర్టుకు అందజేయకుండా జగన్‌ సర్కార్‌ కపట నాటకం ఆడుతోంది. ఆ ఉత్తర్వులను కోర్టుకు సమర్పించకపోవడం వల్లే అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సర్కారు తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నాడు 26 మందిపై కేసు..

సీపీఎ్‌సను రద్దు చేయాలని కోరుతూ 2018 అక్టోబరు 2న విజయవాడలోని ధర్నా చౌక్‌లో సీపీఎస్‌ ఉద్యోగులు నిరాహారదీక్ష చేశారు. దీంతో 26 మంది ఉద్యోగులపై విజయవాడలోని సత్యనారాయణపురం పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. 2019లో కేసు కోర్టులో ఫైల్‌ అయింది. విచారణ సందర్భంగా 19 మందిపై కేసును 1వ అదనపు చీఫ్‌మెట్రోపాలిటన్‌ కోర్టు కొట్టివేసింది. మిగిలిన ఏడుగురు ఉద్యోగుల్లో ఒకరు మరణించడంతో ఆరుగురు కోర్టు వాయిదాలకు హాజరవుతూ వస్తున్నారు. గురువారం విజయవాడలోని 1వ అదనపు ఛీప్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరిగిన వాయిదాకు హాజరు కాకపోవడంతో ఆ ఆరుగురిపై అరెస్ట్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఈ-కోర్టు సైట్‌లో ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు ఆవేదనకు గురయ్యారు.

కేసులు రద్దు చేశారనుకున్నాం..

అరెస్టు వారెంటు జారీ అయినవారిలో ఐదుగురు ఉపాధ్యాయులు, ఒకరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. కేసులు ఉపసంహరించినట్టు జీవో ఇవ్వడంతో కేసులు ఎత్తేశారని అనుకున్నామని, ఇప్పుడు అరెస్టు వారెంట్‌ జారీ అయ్యిందని వారు వాపోతున్నారు. జీవోను కోర్టుకు సమర్పించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జీవో కాపీలు అందలేదంటున్నారని, తగిన ఫార్మాట్‌లో కోర్టుకు పంపాలని తాము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేసుల ఉపసంహరణ జీవోను కోర్టుకు తగిన ఫార్మాట్‌లో అందజేయాలని వారు కోరుతున్నారు.

రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణ..

సీఎం దాస్‌, ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

తనపై అరెస్టు వారెంట్‌ జారీ అయిందని ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌ తెలిపారు. తనతోపాటు ఖాజా, గిరీష్‌, వెంకట్రావు, ప్రసాద్‌, పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్షుడు బెజ్జం సంపత్‌కుమార్‌పైనా వారెంట్లు జారీ అయినట్టు తెలిపారు. ఈ పరిణామాలను ఏపీసీపీఎ్‌సయూఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం సీపీఎస్‌ ఉద్యోగులకు అరెస్టు వారెం ట్లు జారీ చేస్తున్నారన్నారు. ఇవే కేసులను ఎత్తివేస్తూ జగన్‌ సర్కార్‌ 2020 జూలైలో జీవో నెంబరు 731ని జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-28T06:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising