ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayyappa Devotees : కొల్లాం రైలుకు అయ్యప్ప భక్తుల బ్రేక్‌!

ABN, First Publish Date - 2022-12-16T00:46:12+05:30

కొల్లాం రైలుకు విశాఖపట్నంలో అయ్యప్ప భక్తులు బ్రేక్‌ వేశారు! నాలుగు నెలల ముందుగా తాము బుక్‌ చేసుకున్న కోచ్‌లను తీరా ప్రయాణ సమయానికి రద్దు చేయడంతో వారంతా గురువారం ఆందోళనకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏకంగా నాలుగు కోచ్‌ల తొలగింపు.. రిజర్వ్‌డ్‌ బెర్తుల రద్దు..

ఆర్‌ఏసీ కేటాయింపుపై ఆగ్రహం.. దిగివచ్చిన రైల్వే శాఖ

విశాఖపట్నం, డిసెంబరు 15: కొల్లాం రైలుకు విశాఖపట్నంలో అయ్యప్ప భక్తులు బ్రేక్‌ వేశారు! నాలుగు నెలల ముందుగా తాము బుక్‌ చేసుకున్న కోచ్‌లను తీరా ప్రయాణ సమయానికి రద్దు చేయడంతో వారంతా గురువారం ఆందోళనకు గురయ్యారు. పట్టాలపై నిలబడి నిరసన తెలిపారు. రైలు నాలుగు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో విశాఖ రైల్వే స్టేషన్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరికి ఉన్నతాధికారులు దిగిరాక తప్పలేదు. బుకింగ్‌ కన్ఫర్మ్‌ అయిన కోచ్‌(బోగీ)లు తిరిగి ఏర్పాటు చేశారు. చివరికి నాలుగు గంటల ఆలస్యంగా రైలు బయలుదేరింది. వివరాలివీ.. విశాఖ నుంచి కొల్లాం వెళ్లే 18567 నంబరు గల రైలులో ప్రయానానికి నాలుగు నెలల ముందుగా రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులకు రైల్వే శాఖ ఎస్‌-8, 9, 10, 11 స్లీపర్‌ కోచ్‌లలో బెర్తులు ఖరారు చేసింది. ఈ మేరకు ప్రయాణమై అయ్యప్ప భక్తులు గురువారం ఉదయం స్టేషన్‌కు చేరుకున్నారు. ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాం మీదకు వచ్చిన కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎస్‌-8, 9, 10, 11 స్లీపర్‌ క్లాసు కోచ్‌లు కనిపించలేదు. దీంతో అయోమయానికి గురైన వారంతా ఆన్‌లైన్‌ పీఎన్‌ఆర్‌ స్టేట్‌సలో పరిశీలించగా... ఖరారు బెర్తుల ప్రయాణికులకు వేరే కోచ్‌లలో ఆర్‌ఏసీ (సీటు) చూపడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

సమస్యపై స్టేషన్‌లోని సమాచార సిబ్బంది కూడా స్పందించకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. రైలుకు అడ్డంగా పట్టాలపై నిలబడి నిరసన తెలిపారు. తొలగించిన కోచ్‌లను జత చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. కోచ్‌లను తొలగిస్తున్నట్టు ముందుగానే సమాచారమిచ్చామని భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం ఫలితం లేకపోయింది. అయినా ఆందోళన విరమించకపోవడంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఆదేశాలతో వెంటనే ఎస్‌-8, 9, 10,11 కోచ్‌లను రేక్‌కు జత చేశారు. మొత్తానికి ఉదయం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరాల్సిన కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

Updated Date - 2022-12-16T00:46:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising