Byreddy Rajasekhar Reddy: సంక్రాంతి తర్వాత సీమ మొత్తం తిరుగుతా

ABN, First Publish Date - 2022-12-23T16:36:04+05:30

Kurnool: సంక్రాంతి పండుగ తర్వాత రాయలసీమ (Rayalaseema) మొత్తం తిరిగి, సీమవాసులకు జరుగుతోన్న అన్యాయాన్ని వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే (EX MLA) బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని

Byreddy Rajasekhar Reddy:  సంక్రాంతి తర్వాత సీమ మొత్తం తిరుగుతా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool: సంక్రాంతి పండుగ తర్వాత రాయలసీమ (Rayalaseema) మొత్తం తిరిగి, సీమవాసులకు జరుగుతోన్న అన్యాయాన్ని వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే (EX MLA) బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని చేయాల్సి ఉందన్నారు. అయితే వైసీపీ (YCP) నేతలు మాత్రం కర్నూలులో హైకోర్టు (High court) ఏర్పాటు చేస్తున్నామని ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాయలసీమ సమస్యలపై పోరాటం చేసేందుకు మేధావుల కమిటీ ఏర్పాటు చేశానని, ఈ కమిటీ త్వరలో ప్రధాని మోదీని కలుస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి తాను బీజేపీ(BJP)లో ఉన్నానని, ప్రజల నిర్ణయం మేరకు నేను పార్టీ పెట్టాలా? వద్దా? అనేది ఆలోచిస్తానని ఏబీఎన్‌తో బైరెడ్డి చెప్పారు.

Updated Date - 2022-12-23T16:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising