ఏపీలో చింతామణి నాటకం నిషేధం
ABN, First Publish Date - 2022-01-18T03:47:31+05:30
ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...
అమరావతి: ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఇప్పటికీ ఊరూరా ప్రదర్శితమవుతూనే ఉంటుంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘము వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడింది.
తాజాగా ఈ నాటకాన్ని రాష్ట్రంలో నిషేధించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
Updated Date - 2022-01-18T03:47:31+05:30 IST