ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apollo Foundation: రెకిట్ డెటాల్‌తో కలిసి చిల్డ్రన్ హైజీన్ పార్లమెంటును ప్రారంభించిన అపోలో ఫౌండేషన్ టోటల్ హెల్త్

ABN, First Publish Date - 2022-12-29T19:48:31+05:30

అపోలో ఫౌండేషన్ టోటల్ హెల్త్(Apollo Foundation's Total Health)-రెకిట్ డెటాల్ (Reckitt Dettol)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: అపోలో ఫౌండేషన్ టోటల్ హెల్త్(Apollo Foundation's Total Health)-రెకిట్ డెటాల్ (Reckitt Dettol) కలిసి ఆరోగ్య రక్షక్ కార్యక్రమం కింద చిత్తూరు (Chittoor)లో చిల్డ్రన్స్ హైజీన్ పార్లమెంటు నిర్వహించారు. చిన్నారులు, ఉపాధ్యాయుల మధ్య ప్రవర్తన పరంగా మార్పులు తీసుకురావడంతోపాటు పరిశుభ్రత, ఆరోగ్యపరంగా ఉన్న ప్రమాణాలను చేరుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పిల్లలను వారి కమ్యూనిటీలో ఆరోగ్యం, పరిశుభత్ర అంబాసిడర్లుగా మార్చే దిశగా నడిపించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆరోగ్య రక్షక్ కార్యక్రమానికి స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. స్వల్పకాలిక లక్ష్యాలలో పరిశుభ్రత సంబంధిత కారణాలతో కలిగే వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడం కాగా, దీర్ఘకాలిక లక్ష్యాలలో ఆరోగ్యం, పరిశుభ్రత నడుమ సంబంధాన్ని అర్థం చేసుకుని, వ్యక్తిగతంగా, ఇల్లు, కమ్యూనిటీ స్థాయిలో వాటిని ఆచరించ కలిగిన సమాజం నిర్మించడమే లక్ష్యం.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 60 ప్రభుత్వ పాఠశాలల నుంచి 600 మంది విద్యార్ధులు, 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా విద్యార్ధులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. గ్రూప్‌, సోలో సాంగ్స్‌, డ్యాన్స్‌లు కూడా చేశారు. కార్యక్రమం అనంతరం బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

Updated Date - 2022-12-29T19:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising