ఏలుమలై కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
ABN, First Publish Date - 2022-11-27T23:40:55+05:30
అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన రామకుప్పం మండలం 89 పెద్దూరు టీడీపీ వార్డు సభ్యుడు ఏలుమలై కుటుంబానికి న్యాయం జరగకుంటే పోరాటం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు పేర్కొన్నారు.
రామకుప్పం, నవంబరు 27: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన రామకుప్పం మండలం 89 పెద్దూరు టీడీపీ వార్డు సభ్యుడు ఏలుమలై కుటుంబానికి న్యాయం జరగకుంటే పోరాటం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం ఏలుమలై కుటుంబసభ్యులను ఆయన ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏలుమలై మృతి పట్ల దిగ్భారంతిని వ్యక్తం చేశారు. ఏలుమలై కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏలుమలై మృతికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏలుమలై అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ సక్రమంగా జరపాలన్నారు. అతని మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు, వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. లేకుంటే బాధిత కుటుంబం తరపున తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. చంద్రబాబు పీఏ మనోహర్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, కుప్పం మాజీ జడ్పీటీసీ సాంబశివం, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ పార్టీ తరపున ఏలుమలై భార్యకు రూ.25000 ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల నేతలు మనోహర్, గజేంద్ర, కామరాజనాయక్, జ్ఞానశేఖర్‌రెడ్డి, శంకర్, చలం, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-27T23:40:58+05:30 IST