రీజనల్ సైన్స్‌సెంటర్‌లో ‘బయో మిమిక్రి’ ఏర్పాటుకు చర్యలు
ABN, First Publish Date - 2022-11-10T01:12:20+05:30
తిరుపతిలోని రీజనల్ సైన్స్‌సెంటర్‌లో ‘బయో మిమిక్రీ’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్రీనివాస్ నెహ్రూ తెలిపారు.
తిరుపతి అర్బన్, నవంబర్ 9 : తిరుపతిలోని రీజనల్ సైన్స్‌సెంటర్‌లో ‘బయో మిమిక్రీ’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్రీనివాస్ నెహ్రూ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 20 లక్షలు మంజూరయ్యాయని, 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. పెరిగిన జనాభాకు అవసరమైన ఆహారం, తాగునీరు దొరక్కపోవడం, వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం తదితరాలకు కారణాలను బయో మిమిక్రీ ద్వారా వెల్లడించడం జరుగుతుందన్నారు. అదే సమయంలో వీటికి పరిష్కారాలను కూడా ప్రకృతి నుంచే ఎలా తెలుసుకోవాలో వివరించడం జరుగుతుందన్నారు.
Updated Date - 2022-11-10T01:12:23+05:30 IST