Chittoor: మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో టెన్షన్.. టెన్షన్..
ABN, First Publish Date - 2022-12-04T12:03:56+05:30
చిత్తూరు జిల్లా: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) సొంత మండలం సదుంలో టెన్షన్ (Tension) నెలకొంది.
చిత్తూరు జిల్లా: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) సొంత మండలం సదుంలో టెన్షన్ (Tension) నెలకొంది. సదుంలో రైతుభేరి కార్యక్రమం జరపడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) సన్నద్ధమయ్యారు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకునేందుకు యత్నిస్తోంది. అయితే రైతుబేరి కార్యక్రమం జరపడానికి కోర్టు అనుమతి ఉందని రామచంద్ర యాదవ్ అన్నారు. ప్రస్తుతం పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎలాగైనా రైతుబేరి కార్యక్రమం జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా రాత్రి నుంచి రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు నిర్బంధించారు. ఏ క్షణములోనైన రామచంద్ర యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Updated Date - 2022-12-04T12:04:03+05:30 IST